Eetala | ఈటెలను కలిసిన జేఏసీ నాయకులు.. స్పందించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌

Eetala విధాత, మెదక్ బ్యూరో: ఒకప్పుడు నియోజక వర్గ కేంద్రంగా విరాజిల్లిన రామాయంపేట నేడు మున్సిపాల్టీ గానే మిగిలి పోయింది. డీ లిమిటేషన్ లో భాగంగా 2009లో రద్దయిన రామాయంపేట నియోజక వర్గ కేంద్రం నేడు వ్యాపార పరంగా వెనుకబడి పోయింది. దీంతో వ్యాపారులు, అన్ని రాజకీయ పార్టీలు, జేఏసీ గా ఏర్పడి రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమిస్తున్నారు. మొదటి దశ పోరాటంలో వందల మంది పై కేసులు నమోదయ్యాయి. ఉద్యమం ఉదృతం కావడంతో […]

  • By: krs    latest    Aug 04, 2023 12:36 AM IST
Eetala | ఈటెలను కలిసిన జేఏసీ నాయకులు.. స్పందించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌

Eetala

విధాత, మెదక్ బ్యూరో: ఒకప్పుడు నియోజక వర్గ కేంద్రంగా విరాజిల్లిన రామాయంపేట నేడు మున్సిపాల్టీ గానే మిగిలి పోయింది. డీ లిమిటేషన్ లో భాగంగా 2009లో రద్దయిన రామాయంపేట నియోజక వర్గ కేంద్రం నేడు వ్యాపార పరంగా వెనుకబడి పోయింది. దీంతో వ్యాపారులు, అన్ని రాజకీయ పార్టీలు, జేఏసీ గా ఏర్పడి రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమిస్తున్నారు. మొదటి దశ పోరాటంలో వందల మంది పై కేసులు నమోదయ్యాయి.

ఉద్యమం ఉదృతం కావడంతో మంత్రి హరీశ్‌ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు జేఏసీ నాయకులను పిలిపించుకొని డివిజన్ ఏర్పాటు కోసం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడైనా కొత్తగా ఒక్కడివిజన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసినా ముందుగా రామాయంపేట ను డివిజన్ చేస్తామని మంత్రి హరీశ్‌ రావు ఇచ్చిన హామీ అమలు కాలేదు. హరీశ్ హామీ తర్వాతా రాష్ట్రంలో కొత్తగా 4 డివిజన్లు ఏర్పాటు అయ్యాయి. దీంతో మళ్లీ జేఏసీ అధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార,వాణిజ్య, వర్గాలతో పాటు కుల సంఘాలు ఉద్యమించాయి.

కాంగ్రెస్ , బీజేపీ, పార్టీల నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అధ్వర్యంలో 6000 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అధ్వర్యంలో పాద యాత్ర నిర్వహించారు. జేఏసీ అధ్వర్యంలో 2 వ విడుతగా దీక్షలు ప్రారంభించి 131 రోజుకు చేరుకున్నాయి.

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి జేఏసీ నాయకులు హైదరాబాద్ లో కలుసుకొని రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం ను ఒప్పించి డివిజన్ ను ఏర్పాటు కృషి చేయాలని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

దీంతో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఎర్పాటు కోసం ప్రస్తావించారు. ఇప్పటికైనా రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పడాలని, అది జరిగే వరకు డివిజన్ సాధన పోరాటం ఆగదని జేఏసి నాయకులు దామోదర్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, తదితరులు పేర్కొన్నారు.