విధాత: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష వేయడానికి నిరసనగా గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద మౌన నిరసన దీక్ష చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనదీక్షలో పాల్గొనడానికి గాంధీ భవన్‌కు చేరుకుంటున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సభలో మోడీ గురించి ఆరోపణలు చేసిన నేపథ్యంలో అప్పట్లో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేయించారు.
దీనిపై గురువారం సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, శ్రేణులు శాంతి యుత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయాంచారు. పార్టీ పిలుపు మేరకు కాసేపట్లో గాంధీ భవన్‌లో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.