Jailer | ‘భోళా’ని పాతాళానికి తొక్కేసిన జైల‌ర్.. బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ర‌జ‌నీ ప్ర‌భంజనం

Jailer | గ‌త కొన్ని వారాలుగా చిన్న హీరోలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేయ‌గా, ఈ వారం మాత్రం చిరంజీవి, ర‌జ‌నీ కాంత్ వంటి పెద్ద హీరోలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ చేసేందుకు వ‌చ్చారు. ర‌జనీకాంత్ జైల‌ర్ సినిమాతో ఆగ‌స్ట్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాగా, చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రంతో ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఇద్ద‌రు హీరోలు ఒక్క రోజు గ్యాప్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌గా, ఈ పోటీలో ర‌జ‌నీకాంత్ గెలిచారు. జైలర్ […]

  • Publish Date - August 13, 2023 / 05:05 AM IST

Jailer |

గ‌త కొన్ని వారాలుగా చిన్న హీరోలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేయ‌గా, ఈ వారం మాత్రం చిరంజీవి, ర‌జ‌నీ కాంత్ వంటి పెద్ద హీరోలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ చేసేందుకు వ‌చ్చారు. ర‌జనీకాంత్ జైల‌ర్ సినిమాతో ఆగ‌స్ట్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాగా, చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రంతో ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు.

ఇద్ద‌రు హీరోలు ఒక్క రోజు గ్యాప్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌గా, ఈ పోటీలో ర‌జ‌నీకాంత్ గెలిచారు. జైలర్ చిత్రం వరల్డ్ వైడ్ గా క‌న‌క వ‌ర్షం కురిపిస్తుంది. యూఎస్ లో అయితే జైల‌ర్ చిత్రం $ 3 మిలియన్ మార్క్ దాటేసింది. భోళా శంకర్ అయితే వ‌న్ మిలియ‌న్ ట‌చ్ చేయడం కూడా క‌ష్టంగా మారింది. తెలుగు రాష్ట్రాల‌లో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

మ‌న తెలుగు రాష్ట్రాల్లో కూడా భోళా శంకర్ చిత్రంపై జైల‌ర్ ఆధిపత్యం చూపించడం అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. భోళా శంక‌ర్‌కి మొద‌టి ఆట నుండి నెగెటివ్ టాక్ రావ‌డం, జైల‌ర్ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండ‌డంతో ర‌జనీకాంత్ మూవీ ఇక్క‌డ కూడా ఆధిప‌త్యం చూపిస్తుంది.

భోళా శంకర్ చిత్రం శనివారం రోజు రూ. 1 కోటి రూపాయల షేర్ అందుకోగా, అదే సమయంలో జైలర్ రూ. 1.65 కోట్ల షేర్ రాబట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఎక్కువ రెవిన్యూ వ‌చ్చే థియేటర్స్‌లో భోళా శంక‌ర్ ఆడుతున్న, జైల‌ర్‌కి థియేట‌ర్స్ ఎక్కువ‌గా లేక‌పోయిన కూడా జైల‌ర్ ఆధిపత్య‌మే న‌డుస్తుంది.

భోళా శంకర్ నైజాంలో రూ. 30 కోట్లు షేర్ దాటడం కష్టంగా అనిపిస్తుంది. ఇదే జ‌రిగితే భోళా శంకర్ బయ్యర్లు పెద్ద మొత్తంలో నష్టపోనున్నారు. ఇక జైల‌ర్ చిత్రం హ‌వా కొన‌సాగుతుండ‌గా, శ‌నివారం రోజు వసూళ్లు పోటెత్తాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 – 4.50 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.

వరల్డ్ వైడ్‌గా రూ. 30 కోట్లు వరకూ షేర్ రాబట్టిన ఈ చిత్రం రూ. 50 – 56 కోట్లు వరకూ గ్రాస్‌ను కూడా వసూలు చేసి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. మూడు రోజుల్లో జైలర్ చిత్రం రూ. 100 కోట్లు షేర్, 200 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసి ర‌జ‌నీకాంత్ ఈజ్ బ్యాక్ అనిపించింది. నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన జైల‌ర్ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.

ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషించ‌గా, తమన్నా హీరోయిన్‌గా నటించింది. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన‌ సంగీతాన్ని ఇచ్చాడు. ఇక ఈ చిత్రంలో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించారు.