Rajinikanth | గతంలో మందు కొట్టేవాడిని.. రజనీకాంత్ పబ్లిగ్గా చెప్పేశాడు
Rajinikanth విధాత: తప్పు చేయని మనిషంటూ ఉండడు. కానీ చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ తప్పుమీద తప్పు చేసేవాళ్ళే మనచుట్టూ ఎక్కువ. కానీ జీవితంలో ఓ రేంజ్‌కి వెళ్ళాక.. జీవితంలో ఏం పొరపాట్లు చేసామోననే ఎరుకతో ఉండేది మాత్రం కొందరే.. అలా జీవితాన్ని తరచి చూసుకుని చేసిన తప్పులను బహిరంగంగా చెప్పగలగడం ఎవరికో కానీ సాధ్యం కాదు. అలాంటిది ఈ స్టార్ హీరో తన సినీ ప్రయాణం ఆ అలవాటుకు బానిసకాకుండా ఉండి ఉంటే మరోలా […]

Rajinikanth
విధాత: తప్పు చేయని మనిషంటూ ఉండడు. కానీ చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ తప్పుమీద తప్పు చేసేవాళ్ళే మనచుట్టూ ఎక్కువ. కానీ జీవితంలో ఓ రేంజ్‌కి వెళ్ళాక.. జీవితంలో ఏం పొరపాట్లు చేసామోననే ఎరుకతో ఉండేది మాత్రం కొందరే.. అలా జీవితాన్ని తరచి చూసుకుని చేసిన తప్పులను బహిరంగంగా చెప్పగలగడం ఎవరికో కానీ సాధ్యం కాదు.
అలాంటిది ఈ స్టార్ హీరో తన సినీ ప్రయాణం ఆ అలవాటుకు బానిసకాకుండా ఉండి ఉంటే మరోలా ఉండేదని తన చెడు అలవాటును బయట పెట్టాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన గురించి తలుచుకోగానే ఒక ప్రత్యేకమైన హీరోయిజం కనబడుతుంటుంది. అలాంటి హీరో తన గతంలో మద్యం అలవాటును బయటపెట్టాడు.
సూపర్ స్టార్‌గా గుర్తింపు పొంది మంచి సినిమాలతో ఓ రేంజ్‌కి వెళిపోయిన వ్యక్తి.. ఇలా తన జీవితంలో ఉన్న మద్యం అలవాటు గురించి బయట పెట్టాల్సిన పనిలేదు. అలా మద్యానికి నేను బానిసను కాకుండా ఉండి ఉంటే సమాజానికి మంచి చేసేవాడిని, ఆ అలవాటు నన్ను వదలలేదని చెప్పుకొచ్చాడు.
ఇక తనను అందరూ సూపర్ స్టార్ అని పిలవడం మీద కూడా స్పందించాడు రజనీకాంత్. తను సూపర్ స్టార్‌ని కాదని, సూపర్ స్టార్ అనే మాటను తన పేరు ముందు వాడొద్దని నిర్మాతల సమక్షంలో చెప్పాడు. రజనీ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా అవాక్కయ్యారు.
రజనీలోని ఈ సింప్లిసిటీని ఇష్టపడే వారికి అతని తీరు కొత్త కాకపోయినా, చాలా మంది ఆయనలో సూపర్ స్టార్‌ని చూడడానికే ఇష్టపడే వారికి రజనీ మాటలు చివుక్కుమన్నాయి. కానీ ఆయనలోని సింప్లిసిటీని ఇలా బయట పెట్టడాన్ని పలువురు ప్రశంసించారు కూడా. అయితే తన జైలర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటైన ప్రెస్‌మీట్‌లో తలైవా ఈ వ్యాఖ్యలను చేశారు. రజనీకాంత్.. తమన్నాతో జత కట్టిన ‘జైలర్’ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది.