Janhvi Kapoor | మరోసారి ట్రోలింగ్ బారిన జాన్వీకపూర్..కారణం ఇదే..?
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె అందాల ప్రదర్శన నెట్టింట్లో అందరికీ కంటిపై కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. వస్త్రధారణ తరుచూ ట్రోలింగ్ బారినపడుతూ ఉంటుంది. వైరల్ బయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేయగా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నది. వీడియోలో.. ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన సమయంలో […]

Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె అందాల ప్రదర్శన నెట్టింట్లో అందరికీ కంటిపై కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
వస్త్రధారణ తరుచూ ట్రోలింగ్ బారినపడుతూ ఉంటుంది. వైరల్ బయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేయగా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నది. వీడియోలో.. ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన సమయంలో ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.
తన కారు ఎక్కడుందో జాన్వీ గుర్తించ లేకపోవడంతో పాటు నా కారు ఎక్కడుంది? అని అక్కడున్న వారిని ప్రశ్నించడం కనిపిస్తోంది. అలాగే డ్రైవర్ వెనుకాలే ఉన్నా గుర్తుపట్టలేకపోయింది. నీ వెనుకాలే డ్రైవర్ ఉన్నాడని కెమెరామెన్లు చెబితే గానీ తెలుసు కోలేకపోయింది. దీన్ని చూసిన నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.
తప్ప తాగినట్లుగా ఉందని, ఏదో మైకంలో ఉందంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ మిలీ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా.. డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం బావల్, మిస్టర్ అండ్ మిస్సెస్ నటిస్తుండగా.. విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే జనగణమన సినిమాలోనూ నటించనున్నట్లు తెలుస్తున్నది.
View this post on Instagram