Janhvi Kapoor | జాన్వీ.. నెక్ట్స్ టార్గెట్ రామ్ చరణేనా? అందుకేనా ఈ భజన?

Janhvi Kapoor | ఎదుటివారిని పొగిడామంటే అది వాళ్లకు ఏదో ఉపయోగం పొందేందుకేనని కాస్త మెదడులో గుజ్జున్న ప్రతి ఒక్కరకీ ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ముఖస్తుతి చేసేవారిలో రాజకీయ నాయకులు ముందుంటే.. వాళ్ల వెంటే సినీ జనాలూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్లు ఒక హీరో ఇష్టమని.. అతనితో సినిమా అయిన తర్వాత మరో హీరో ఇష్టమని ఇలా.. అవకాశాల కోసం మాటలు మారుస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడదే బాటలో శ్రీదేవి ముద్దుల […]

  • By: krs    latest    Aug 01, 2023 6:25 PM IST
Janhvi Kapoor | జాన్వీ.. నెక్ట్స్ టార్గెట్ రామ్ చరణేనా? అందుకేనా ఈ భజన?

Janhvi Kapoor |

ఎదుటివారిని పొగిడామంటే అది వాళ్లకు ఏదో ఉపయోగం పొందేందుకేనని కాస్త మెదడులో గుజ్జున్న ప్రతి ఒక్కరకీ ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ముఖస్తుతి చేసేవారిలో రాజకీయ నాయకులు ముందుంటే.. వాళ్ల వెంటే సినీ జనాలూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్లు ఒక హీరో ఇష్టమని.. అతనితో సినిమా అయిన తర్వాత మరో హీరో ఇష్టమని ఇలా.. అవకాశాల కోసం మాటలు మారుస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడదే బాటలో శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ కూడా చేరిపోయింది.

ఒకప్పుడు వెండితెరని ఓ ఊపు ఊపిన నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, కాస్త లేట్‌గానే తెలుగు తెరకు పరిచయం అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఖ్యాతి నలు దిశలలోనూ మారు మ్రోగిపోతోంది. తెలుగు సినిమా అంటే కాస్త చిన్నచూపు చూసే వారి దృష్టి.. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లతో ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు మన పాన్ ఇండియా సినిమాల మోతకి అందరి చూపు ఇటుపడింది.

ఒక్క సినిమా చేసినా మూడు నాలుగు భాషల్లో హిట్ కొట్టేయచ్చనే ఆలోచనలో ఉన్నారు. అయితే మనసు లోపల ఏ ఆలోచన ఉన్నా కాకా పట్టడంలో బాలీవుడ్ జనాలకు మాత్రం ప్రత్యేకమైన శైలి ఉంది. హిందీ సినిమాకు ప్రస్తుతం సరైన మార్కెట్ లేదు కాబట్టి వాళ్ళ ఆశలన్నీ తెలుగు తెరమీదనే పెట్టుకున్నారు.ఈ ఆలోచనలోనే అక్కడి హీరో హీరోయిన్స్ మన హీరోలని, డైరెక్టర్లనీ తెగ పొగిడేస్తున్నారు. తాజాగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇదే ఐడియాను ఫాలో అయింది. ఎలాగైనా తెలుగు సినిమాలలో ఛాన్స్ కోసమే ఈ ప్రయత్నాలన్నీ..

ప్రస్తుతం జాన్వీ, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పట్టాలెక్కిందో లేదో వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయ్. అఖిల్‌తో ఒక మూవీకి ఓకే చెప్పినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మరికొందరు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాల నిమిత్తం స్క్రిప్ట్స్ కూడా వింటుందట. ఎలాగైనా సరే తెలుగులో స్టార్ హీరోయిన్ కావాలని బలంగా అనుకుంటుందో ఏమోకానీ.. పెద్ద స్టార్స్‌ని తెగ పొగిడే పని పెట్టుకుంది జాన్వీ.

అయితే ‘దేవర’ సినిమాకు ముందు ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు రామ్ చరణ్ పై ప్రసంశల జల్లు కురిపిస్తోంది. తన ‘బవల్’ హిందీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ కపూర్, రామ్ చరణ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతవరకు రామ్ చరణ్ లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని చూడలేదని, ఆయనతో మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. దీంతో.. ఇది చరణ్‌తో మరో ప్రాజెక్ట్ కి వేస్తున్న గాలమని, అందుకే ఈ భజన మొదలెట్టిందనేలా కామెంట్స్ మొదలయ్యాయి.