మ‌రో వివాహం చేసుకున్న స‌హ‌జ‌ న‌టి జ‌య‌సుధ‌..?

విధాత‌: సినీ నటి, సీనియర్ స్టార్ హీరోయిన్, సహజ నటి జయసుధ. ఈమె గత కొంత కాలంగా ఒక బిజినెస్ మెన్‌ను వివాహం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ ఈవెంట్‌కి గాని ఫంక్షన్‌కి గాని వెళ్లినా జయసుధ అతనితోనే కలిసి వస్తోంది. దీంతో అతన్ని ఆమె వివాహం చేసుకుంద‌ని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. మొన్నటికి మొన్న ఆలీ కూతురు పెళ్లిలో ఈ జంట సందడి చేసింది. తాజాగా వారీసు చిత్రం ఈవెంట్‌లో కూడా జయసుధ ఇతనితో […]

  • Publish Date - January 14, 2023 / 10:30 AM IST

విధాత‌: సినీ నటి, సీనియర్ స్టార్ హీరోయిన్, సహజ నటి జయసుధ. ఈమె గత కొంత కాలంగా ఒక బిజినెస్ మెన్‌ను వివాహం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ ఈవెంట్‌కి గాని ఫంక్షన్‌కి గాని వెళ్లినా జయసుధ అతనితోనే కలిసి వస్తోంది. దీంతో అతన్ని ఆమె వివాహం చేసుకుంద‌ని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి.

మొన్నటికి మొన్న ఆలీ కూతురు పెళ్లిలో ఈ జంట సందడి చేసింది. తాజాగా వారీసు చిత్రం ఈవెంట్‌లో కూడా జయసుధ ఇతనితో కనిపించింది. ఈ జంట ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు. జయసుధ మొద‌ట‌గా కాక‌ర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది.

విభేదాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత ఈమె తెలుగులో నాడు అగ్ర నిర్మాత‌గా ఉన్న వడ్డే రమేష్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనితో కూడా విడిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కజిన్ నితిన్ కపూర్‌ను వివాహమాడింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అత‌ని మృతి త‌ర్వాత ఆమె ఈ బిజినెస్ మాన్‌ను వివాహం చేసుకుంది అంటున్నారు.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా సహజ నటిగా అందరి స‌ర‌స‌న నటించి నాటి ఎన్టీఆర్ నుండి నేటి బాలకృష్ణ వరకు నటించి మెప్పించిన జయసుధ రీఎంట్రీలో స్టార్ హీరోలకు తల్లిగా అద్భుత పాత్రలు చేస్తోంది. ఈమె వారసుడు సినిమాలో విజయ్‌కి తల్లిగా నటించింది.

జయసుధ భర్త నితిన్ కపూర్ 2017లో మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు. వారి పేరు నిహార్ కపూర్, శ్రేయన్ కపూర్. భర్త మరణం తరువాత ఈమె తన కుమారుల వద్ద ఉంటూ వస్తుంది. ఇటీవల అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లి చికిత్స పొంది ఇండియా వచ్చింది. చికిత్స అనంతరం గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయింది. ఇప్పుడిప్పుడే ఆమె తన మునుపడి రూపానికి వస్తోంది.