JDS Karnataka | వ‌క్క‌ళిగ‌ల‌కు కొత్త నాయ‌కుడు.. జేడీఎస్ క‌థ కంచికేనా?

JDS విధాత: తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ క‌న్నా జేడీఎస్‌ (JDS Karnataka)ను ఎక్కువ క‌ల‌వ‌ర‌ పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని ద‌శాబ్దాలుగా ఆ పార్టీకి గంపగుత్త‌గా ప‌డిన వ‌క్క‌ళిగ ఓట్లు ఈ సారి కాంగ్రెస్ ఖాతాలో ప‌డ‌ట‌మే దీనికి కార‌ణం. దీని వెనుక క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ కృషి చాలానే ఉంది. జేడీఎస్‌కు గ‌ట్టి ప‌ట్టు ఉన్న ఓల్డ్ మైసూరు రీజియ‌న్‌లో 61 మందిని నిల‌బెట్ట‌గా 30 మందిని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంది. స్థానికంగా […]

  • Publish Date - May 14, 2023 / 09:22 AM IST

JDS

విధాత: తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ క‌న్నా జేడీఎస్‌ (JDS Karnataka)ను ఎక్కువ క‌ల‌వ‌ర‌ పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని ద‌శాబ్దాలుగా ఆ పార్టీకి గంపగుత్త‌గా ప‌డిన వ‌క్క‌ళిగ ఓట్లు ఈ సారి కాంగ్రెస్ ఖాతాలో ప‌డ‌ట‌మే దీనికి కార‌ణం. దీని వెనుక క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ కృషి చాలానే ఉంది.

జేడీఎస్‌కు గ‌ట్టి ప‌ట్టు ఉన్న ఓల్డ్ మైసూరు రీజియ‌న్‌లో 61 మందిని నిల‌బెట్ట‌గా 30 మందిని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంది. స్థానికంగా బ‌లంగా ఉన్న వ‌క్క‌ళిగ నాయ‌కుల‌ను డీకే ఏరి కోరి ఎంచుకోవ‌డం, ముస్లిం ఓట్ల‌ను స‌మీక‌రించ‌డం మొద‌లైన‌వి ఈ విజ‌యానికి కార‌ణంగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. జేడీఎస్ ఖాతా 19 ద‌గ్గ‌రే ఆగిపోయిందంటే కుమార‌స్వామిని డీకే ఎంత ఘోరంగా ఓడించారో అర్థ‌మ‌వుతుంది.

పుట్టి ముంచిన కుటుంబ క‌ల‌హాలు

కింగ్ కాక‌పోయినా కింగ్ మేక‌ర్ కావాల‌ని ఆశ ప‌డిన జేడీఎస్‌ను కుటుంబ క‌ల‌హాలు నిలువునా ముంచేశాయి. ముఖ్యంగా సోద‌రులు హెచ్‌డీ రేవ‌ణ్ణ‌, కుమార‌స్వామిల మ‌ధ్య ఎన్నిక‌ల ముందు జ‌రిగిన వాదోప‌వాదాలే కంచుకోట లాంటి రామ‌న‌గ‌ర నుంచి పోటీ చేసిన దేవెగౌడ మ‌న‌వ‌డు నిఖిల్ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాయ‌ని స్థానిక నాయ‌కులు చెబుతున్నారు.

ఇలాంటి ఘోర ఓట‌మి త‌ర్వాత జేడీఎస్ భ‌విష్య‌త్తు ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న. వ‌క్క‌ళిగ‌లు క‌నుక డీకేను త‌మ నాయ‌కుడిగా గుర్తిస్తే మాత్రం క‌న్న‌డ రాజ‌కీయాల్లో ఆ పార్టీ పాత్ర నామ‌మాత్రంగా మారిపోయే అవ‌కాశ‌మే ఎక్కువ‌.