Viral Video | కమలా హ్యారిస్ భర్తకు జో బైడెన్ భార్య లిప్ కిస్
అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ భర్త దౌగ్ ఎమ్హాఫ్కు అందరూ చూస్తుండగానే లిప్ కిస్ ఇచ్చి.. ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన మంగళవారం క్యాపిటల్ హిల్లో జరిగిన స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్ సమావేశంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం జిల్ బైడెన్ లిప్ కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేట్ ఆఫ్ ద యూనియన్లో […]

అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ భర్త దౌగ్ ఎమ్హాఫ్కు అందరూ చూస్తుండగానే లిప్ కిస్ ఇచ్చి.. ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన మంగళవారం క్యాపిటల్ హిల్లో జరిగిన స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్ సమావేశంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం జిల్ బైడెన్ లిప్ కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టేట్ ఆఫ్ ద యూనియన్లో బైడెన్ ప్రసంగించడం ఇది రెండోసారి. ఈ సారి ఆయన ఉభయసభలను ఉద్దేశించి ఒక గంటా 15 నిమిషాలు ప్రసంగించారు. బైడెన్ ప్రసంగాన్ని రిపబ్లికన్లు పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జో బైడెన్ చైనాను పరోక్షంగా హెచ్చరించారు. ఒక వేళ తమ సార్వభౌమత్వానికి చైనా నుంచి ప్రమాదం పొంచి ఉంటే, అప్పుడు దేశాన్ని రక్షించుకునేందుకు సరైన రీతిలో స్పందిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. గత శనివారం చైనా నిఘా బెలూన్ను పేల్చివేసిన విషయాన్ని ఆయన తన ప్రసంగంలో పరోక్షంగా వెల్లడించారు.
Did Jill Biden just kiss Kamala’s husband on the LIPS?! pic.twitter.com/KvrUxSI8Lu
— Benny Johnson (@bennyjohnson) February 8, 2023