చైనా జీవితకాల అధ్యక్షుడిగా జిన్‌పింగ్!
విధాత: జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి ఎన్నుకోవడమే అజెండాగా చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహా సభలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కమ్యూనిస్టు ప్రతనిధులు ఓటు వేయనున్నారు. సీపీసీ సమావేశాలు జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టనున్నాయి. ఈ మహాసభలను ఉద్దేశించి ప్రసంగించిన జిన్‌పింగ్ తైవాన్ వేర్పాటుపై స్పందించారు. తెలంగాణ ప్రాంతీయ సమగ్రత్తను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. తైవాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా తీరుపై ఆగ్రహం […]

విధాత: జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి ఎన్నుకోవడమే అజెండాగా చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహా సభలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కమ్యూనిస్టు ప్రతనిధులు ఓటు వేయనున్నారు. సీపీసీ సమావేశాలు జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టనున్నాయి.
ఈ మహాసభలను ఉద్దేశించి ప్రసంగించిన జిన్‌పింగ్ తైవాన్ వేర్పాటుపై స్పందించారు. తెలంగాణ ప్రాంతీయ సమగ్రత్తను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. తైవాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో జోక్యం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
తైవాన్ విషయంలో బల ప్రయోగానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అధ్యక్షుడిగా గత పదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను, పురోగతిని వివరించారు. హాకాంగ్‌పై చైనా స్పష్టమైన ఆధిపత్యం సాధించిందని వెల్లడించారు. ఆందోళనలతో అట్టుకుడిన ప్రాంతాన్ని సుపరిపాలన పాలనపై నడిపించామని పేర్కొన్నారు.