జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా: పద్మా దేవేందర్‌రెడ్డి
విధాత, మెదక్ ఉమ్మడి బ్యూరో: జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్ లో టీ యూ డబ్లు జే మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ల యూనియన్ TUWJ - iju ద్వితీయ జిల్లా మహాసభకు చీఫ్ గెస్ట్ గా హాజరై జర్నలిస్టులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తెలంగాణ […]

విధాత, మెదక్ ఉమ్మడి బ్యూరో: జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్ లో టీ యూ డబ్లు జే మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ల యూనియన్ TUWJ – iju ద్వితీయ జిల్లా మహాసభకు చీఫ్ గెస్ట్ గా హాజరై జర్నలిస్టులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాట సమయంలో ఆంధ్ర యాజమాన్యాలను ధిక్కరించి పోరాట స్పూర్తిని తెలిపింది జర్నలిస్ట్ లే అని యాది జేసుకున్నారు. ఈ మధ్య కాలంలో వాట్సప్ వచ్చాక న్యూస్ విలువలు తగ్గిపోయాయని, ఏది నిజం ఏదీ అబద్ధమో తెలియడం లేదన్నారు.
ఒక న్యూస్ పేపర్, ఒక ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ న్యూస్ ను కలెక్ట్ చేసే టైంలోనే వాట్సప్ లో న్యూస్ మారిపోతుందని ఆమె తెలిపారు. జర్నలిస్ట్ లకు మంచి రోజులు రావాలంటే ఫెక్ న్యూస్ లను ఫార్వార్డ్ చేయొద్దని సూచించారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డుల గురించి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు దృష్టికి తీసుకుని వెళ్తానని జర్నలిస్ట్ లకు హామీ ఇచ్చారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ లకు గృహ వసతి కల్పించడం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. టీయూడబ్యూజె ఐజేయి రాష్ట్ర కార్యదర్శి విరహత్ ఆలీ మాట్లాడుతూ దశాబ్దాలుగా టీ యూ దబ్లు జే యూనియన్ జర్నలిస్ట్ ల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారం కోసం అవిరళ కృషి చేస్తోందన్నారు. జాతీయ స్థాయిలో జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక సంఘం టీయు డబ్ల్యూ జే ఐజేయు సంఘమని తెలిపారు. ఎక్కడ ఏ జర్నలిస్ట్ కు ఏ సమస్య, ఆపద వచ్చినా యూనియన్ స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు చెప్పారు.
అర్హులైన విలేకరులు అందరికీ అక్రిడిటేశన్ కార్డులు ఇప్పించేందుకు పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డులు పనిచేసేలా, అన్ని కార్పొరేట్ హాస్పిటల్లలో క్యాష్ కేస్ ట్రీట్ మెంట్ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంతి నరేందర్, జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్య దర్శి అశోక్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి బొందుగుల నాగరాజు, యూనియన్ బాధ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి, ఫారుక్ హుసేన్, వెంకట్ గౌడ్, భూమయ్య, రాజ్ శేఖర్, ఆనంద్, రఘుపతి, వివిధ మండలాల జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలి పలువురు సీనియర్ జర్నలిస్ట్ లను శాలువా, మెమెంటో తో సన్మానించారు.