సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్.. ఎందుకంటే..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మర్యాదపూర్వకంగా సోమవారం ఉదయం కలిశారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మర్యాదపూర్వకంగా సోమవారం ఉదయం కలిశారు. జనవరి 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని రేవంత్ రెడ్డిని పాల్ ఆహ్వానించారు.
గ్లోబల్ పీస్ సమ్మిట్‌కు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాల్సిందిగా పాల్ రేవంత్ రెడ్డిని కోరాగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ప్రపంచ శాంతి సదస్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు నాయకులను ఆహ్వానించినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది హాజరవుతున్నట్లు పాల్ వెల్లడించారు.