Kadem
విధాత ప్రతినిధి:- అదిలాబాద్: గత నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం ఈదురుగాలులకు మామిడిపంట నష్టపోయి రైతు ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కడెం(Kadem) మండలంలో చోటుచేసుకుంది.
వివరాలకు వెళ్తే కడెం మండలంలోని కల్లేడ గ్రామానికి చెందిన రైతు బీర్పూర్ లచ్చన్న 46 సంవత్సరాల వ్యక్తి గత నాలుగు రోజుల క్రితం.. ఈదురు గాలులతో కురిసిన ఆకాల వర్షానికి మామిడికాయలు రాలి తీవ్ర నష్టం వాటిల్లింది.
దానికి తోడు అప్పుల కావడంతో తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.