శ్రీలీల.. తల్లిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌?

విధాత‌: కాజల్ అగర్వాల్ ఈ పేరు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా బాగా పాపులర్. 2004వ సంవత్సరంలో క్యూ హో గయానా చిత్రంతో వెండితెరకు పరిచయమవగా 2007లో తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది. మూడో చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో తారాపథానికి చేరుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన అందం అభినయంతో ప్రేక్షకుల […]

  • Publish Date - January 30, 2023 / 05:03 AM IST

విధాత‌: కాజల్ అగర్వాల్ ఈ పేరు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా బాగా పాపులర్. 2004వ సంవత్సరంలో క్యూ హో గయానా చిత్రంతో వెండితెరకు పరిచయమవగా 2007లో తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది.

మూడో చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో తారాపథానికి చేరుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా మెప్పించింది. తెలుగులో చివరగా దుల్హర్‌ సల్మాన్‌ నటించిన డబ్బింగ్‌ చిత్రం హే సినామికలో కనిపించింది.

చిరంజీవి ఆచార్య సినిమా సమయంలో 2020లో అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతం కిచ్లుని వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుది. 2022 ఏప్రిల్ 19న మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఇప్పుడు కాజల్‌ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని భావిస్తోంది.

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఎన్బీకే 108 చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుండగా ఆమెకు తల్లి పాత్రలో కాజల్ అగర్వాల్‌ని తీసుకోవాలని యూనిట్ భావిస్తోంది. కానీ కాజల్‌ అంగీకరిస్తుందా అనేది అనుమానంగా ఉన్నది.

కాగా ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. సైన్ స్క్రీన్ బ్యానర్‌పై సారు గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి 5వ తేదీన మొదలు పెట్టనున్నారు.

కామెడీని పండించడంలో దిట్టైనా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తూ ఉండడం అందులో ఇది తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా వీరసింహారెడ్డి తరువాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.