క‌ళాత‌ప‌స్వికి తుది వీడ్కోలు.. అశ్రున‌య‌నాల మ‌ధ్య అంత్య‌క్రియ‌లు

విధాత‌: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ అంతిమ‌యాత్ర‌లో భారీ సంఖ్య‌లో ఆయ‌న అభిమానులు పాల్గొని తుది వీడ్కోలు ప‌లికారు. అశ్రున‌య‌నాల మ‌ధ్య అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు. క‌ళాత‌ప‌స్వి అంత్య‌క్రియ‌లు పంజాగుట్ట శ్మ‌శాన‌వాటిలో కుటుంబ స‌భ్యులు, సినీ ప్ర‌ముఖుల సమ‌క్షంలో నిర్వ‌హించారు. ఆ కుటుంబ ఆచార‌, సంప్ర‌దాయాల ప్ర‌కారం అంత్య‌క్రియ‌లను ముగించారు. అంతిమ‌యాత్ర కంటే ముందు విశ్వ‌నాథ్ పార్థివ‌దేహాన్ని ఫిలిం చాంబ‌ర్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఆయ‌న పార్థివ‌దేహానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు నివాళుల‌ర్పించారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో […]

  • Publish Date - February 3, 2023 / 11:48 AM IST

విధాత‌: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ అంతిమ‌యాత్ర‌లో భారీ సంఖ్య‌లో ఆయ‌న అభిమానులు పాల్గొని తుది వీడ్కోలు ప‌లికారు. అశ్రున‌య‌నాల మ‌ధ్య అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు. క‌ళాత‌ప‌స్వి అంత్య‌క్రియ‌లు పంజాగుట్ట శ్మ‌శాన‌వాటిలో కుటుంబ స‌భ్యులు, సినీ ప్ర‌ముఖుల సమ‌క్షంలో నిర్వ‌హించారు. ఆ కుటుంబ ఆచార‌, సంప్ర‌దాయాల ప్ర‌కారం అంత్య‌క్రియ‌లను ముగించారు.

అంతిమ‌యాత్ర కంటే ముందు విశ్వ‌నాథ్ పార్థివ‌దేహాన్ని ఫిలిం చాంబ‌ర్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఆయ‌న పార్థివ‌దేహానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు నివాళుల‌ర్పించారు.

గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కే విశ్వ‌నాథ్ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణంతో శంక‌రాభ‌ర‌ణం రాగం మూగ‌బోయింది. చ‌ల్లని సిరివెన్నెల‌కు కారుమ‌బ్బులు క‌మ్మేసాయి. స్వ‌యంకృషితో ఎదిగిన ఆ ఆప‌ద్భాంద‌వుడు.. క‌ళ‌ల కోస‌మే బ‌తికిన ఆ సూత్ర‌ధారి.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎన్నో మ‌రుపురాని సినిమాల‌ను అందించిన విశ్వ‌నాథ్‌ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా జీవించి ఉంటార‌న‌డంలో సందేహం లేదు.