Kamareddy: కన్న తల్లిని చంపి.. పూడ్చిపెట్టిన కన్న కొడుకు

Kamareddy విధాత, కామారెడ్డి: సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్ట బోయిన బాలవ్వ అనే 80 సంవత్సరాల వయస్సు గల బాలవ్వ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. దీంతో కన్నతల్లి బాలవ్వకు సేవ చేయలేక, పోషించలేక ఈ నెల 13వ తారీఖున కన్న కొడుకు చిన్న బాలయ్య కన్నతల్లి బాలవ్వ గొంతు నులిమి చంపేసి ఎవరికి అనుమానం రాకుండా తల్లి శవాన్ని పూడ్చిపెట్టాడు. మరుసటి రోజు తల్లి కనిపించడం లేదని స్థానిక సదాశివనగర్ పోలీస్ […]

  • Publish Date - April 18, 2023 / 09:52 AM IST

Kamareddy

విధాత, కామారెడ్డి: సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్ట బోయిన బాలవ్వ అనే 80 సంవత్సరాల వయస్సు గల బాలవ్వ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది.

దీంతో కన్నతల్లి బాలవ్వకు సేవ చేయలేక, పోషించలేక ఈ నెల 13వ తారీఖున కన్న కొడుకు చిన్న బాలయ్య కన్నతల్లి బాలవ్వ గొంతు నులిమి చంపేసి ఎవరికి అనుమానం రాకుండా తల్లి శవాన్ని పూడ్చిపెట్టాడు.

మరుసటి రోజు తల్లి కనిపించడం లేదని స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కొడుకు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

ఈ రోజు (మంగళవారం) మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుక భాగంలోని ఓ స్థలంలో పూడ్చిపెట్టిన శవాన్ని సదాశివనగర్ పోలీసులు గుర్తించి చిన్న బాలయ్య అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.