Karimnagar
విధాత బ్యూరో, కరీంనగర్: చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి బొడిగె శ్యామ్ ఆత్మహత్య కేసులో కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగంలో సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్న గోపీకృష్ణ బుధవారం పోలీసులకు లొంగిపోయారు. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
భూపాలపట్నం గ్రామానికి చెందిన బొడిగె శ్యామ్ మధ్యవర్తిత్వంలో సీఐ 20 గుంటల భూమి కొనుగోలు చేశారు. ఆ పెట్టుబడిపై లాభాలు వస్తాయని ఆయన ఆశించారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగా లేక పోవడంతో తిరిగి ఆ భూమిని తీసుకోవాలని, అదనంగా 10 లక్షలు తనకు చెల్లించాలని గోపీకృష్ణ శ్యామ్ ను డిమాండ్ చేశాడు.
సీఐ వేధింపులు భరించలేక ఈనెల 21వ తేదీన శ్యామ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీకృష్ణ వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.