Karimnagar | గంగుల అవినీతి, కబ్జాలు, డొల్ల అభివృద్ధి పై ఆధారాలతో నిరూపిస్తా: నరేందర్ రెడ్డి

Karimnagar బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్‌ రెండు రోజులలో స్థలం, సమయం మీరే నిర్ణయించండి స్పందించకుంటే సోమవారం ఇందిరాచౌక్ వద్ద ఆధారాలను ప్రజలకు అందజేస్తాం మంత్రి గంగులకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సవాల్ విధాత బ్యూరో, కరీంనగర్: అవినీతి పాలన, భూకబ్జాలు, డొల్ల అభివృద్ధిపై ఆధారాలతో వస్తాం.. స్థలం, సమయం మీరే నిర్ణయించండి.. రెండు రోజులలో స్పందించకపోతే సోమవారం ఆధారాలను ప్రజలకు అందజేస్తాం అని మంత్రి గంగులకు సవాల్ విసిరారు నగర […]

Karimnagar | గంగుల అవినీతి, కబ్జాలు, డొల్ల అభివృద్ధి పై ఆధారాలతో నిరూపిస్తా: నరేందర్ రెడ్డి

Karimnagar

  • బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్‌
  • రెండు రోజులలో స్థలం, సమయం మీరే నిర్ణయించండి
  • స్పందించకుంటే సోమవారం ఇందిరాచౌక్ వద్ద ఆధారాలను ప్రజలకు అందజేస్తాం
  • మంత్రి గంగులకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సవాల్

విధాత బ్యూరో, కరీంనగర్: అవినీతి పాలన, భూకబ్జాలు, డొల్ల అభివృద్ధిపై ఆధారాలతో వస్తాం.. స్థలం, సమయం మీరే నిర్ణయించండి.. రెండు రోజులలో స్పందించకపోతే సోమవారం ఆధారాలను ప్రజలకు అందజేస్తాం అని మంత్రి గంగులకు సవాల్ విసిరారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగర కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం మంత్రి గంగులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

కాంగ్రెస్ నాయకులను గ్రామాలలోకి రావద్దని బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు కట్టించడంపై మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే వరకు అధికార పార్టీ నేతలను గ్రామాలలోకి రానివ్వ‌ద్దని తాము కూడా ఫ్లెక్సీలు కట్టిస్తామని హెచ్చరించారు. గంగుల చిల్లర రాజకీయాలు మాని, చిత్తశుద్ధి ఉంటే తాను విసిరిన సవాలును స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని నరేందర్ రెడ్డి అన్నారు. జీకే యూత్, పికే యూత్ పేరిట రచ్చచేయడం మాని చర్చకు సిద్దం కావాలని అన్నారు.

విలేకరుల సమావేశంలో సమద్ నవాబ్, చర్ల పద్మ,శ్రవణ్ నాయక్,కొరివి అరుణ్ కుమార్,లింగంపల్లి బాబు,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,ఎండి చాంద్,దండి రవీందర్,షబానా మహమ్మద్,ఊరడి లత, ముల్కల కవిత,జ్యోతి రెడ్డి,ఎగ్గడి శారద,మెతుకు కాంతయ్య,బత్తిని చంద్రయ్య,లాయక్,మహాలక్ష్మి,నేహల్ అహ్మద్,జీడి రమేష్,ముక్క భాస్కర్,నెల్లి నరేష్,రాజ్ కుమార్,మహమ్మద్ బారీ,సిరాజొద్ధిన్,ఉప్పరి.అజయ్, హనీఫ్,యోన,అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.