Karimnagar | రైలు కిందపడి జర్నలిస్టు ఆత్మహత్య

స్థానిక జర్నలిస్టులే వృత్తికి అడ్డు తగులుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణ మండల జర్నలిస్టులు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని విజ్ఞప్తి రామగిరి ఎస్సై కి సూసైడ్ నోట్ విధాత బ్యూరో, కరీంనగర్: జర్నలిజం వృత్తిలో ప్రతిక్షణం అడ్డు తగులుతున్నారు… అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా.. నా చావు పై ఎలాంటి అనుమానాలు, విచారణలు అవసరం లేదు.. అని పేర్కొంటూ ఓ జర్నలిస్ట్ గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లా […]

  • Publish Date - April 13, 2023 / 12:37 AM IST
  • స్థానిక జర్నలిస్టులే వృత్తికి అడ్డు తగులుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణ
  • మండల జర్నలిస్టులు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని విజ్ఞప్తి
  • రామగిరి ఎస్సై కి సూసైడ్ నోట్

విధాత బ్యూరో, కరీంనగర్: జర్నలిజం వృత్తిలో ప్రతిక్షణం అడ్డు తగులుతున్నారు… అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా.. నా చావు పై ఎలాంటి అనుమానాలు, విచారణలు అవసరం లేదు.. అని పేర్కొంటూ ఓ జర్నలిస్ట్ గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో చోటుచేసుకుంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ కొప్పుల గణపతి, స్థానిక విలేకరులు పొన్నం శ్రీనివాస్, చిందం రమేష్,
కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రామగిరి వార్త దినపత్రిక విలేకరి పొన్నం శ్రీకాంత్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు.

తన సూసైడ్ నోట్ ఆయన నేరుగా రామగిరి ఎస్సైకి వాట్సాప్ చేశారు. స్థానిక ట్రేడ్ యూనియన్ నాయకుడు కోట రవీందర్ రెడ్డిపై తాను వార్త రాస్తే ఏడాదికాలంగా మాట్లాడకుండా ఉండి, ప్రస్తుతం తనపై బురదజల్లే ప్రయత్నం చేశాడని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వీరి బాధలు భరించలేకపోతున్నానని పేర్కొంటూ పొన్నం శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

జర్నలిస్టుగా తాను ఎవరిని మోసం చేయలేదని, వృత్తిని అడ్డుపెట్టుకొని ఎవరి వద్ద దోచుకోలేదని చెప్తూ, మండల కేంద్రంలోని విలేకరులందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని తన చివరి కోరికను వెల్లడించారు. పై నలుగురికి శిక్ష పడాలని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.