Karimnagar | MLC జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పాశిగామలో పోలీసు బలగాల మోహరింపు

వెల్గటూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రకంపనలు విధాత బ్యూరో, కరీంనగర్: సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో, 700 కోట్ల రూపాయల అంచనాతో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ అధికార పార్టీ నేతలకు చికాకులు తెప్పిస్తోంది. కాలుష్యాన్ని వెదజల్లే ఈ ఫ్యాక్టరీ తమకు అక్కరలేదంటూ కాశిపాక, స్తంభంపల్లి గ్రామాల ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా స్థలం చదును చేసేందుకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానికుల ఆగ్రహాన్ని […]

  • Publish Date - April 1, 2023 / 01:24 AM IST

వెల్గటూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రకంపనలు

విధాత బ్యూరో, కరీంనగర్: సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో, 700 కోట్ల రూపాయల అంచనాతో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ అధికార పార్టీ నేతలకు చికాకులు తెప్పిస్తోంది.

కాలుష్యాన్ని వెదజల్లే ఈ ఫ్యాక్టరీ తమకు అక్కరలేదంటూ కాశిపాక, స్తంభంపల్లి గ్రామాల ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా స్థలం చదును చేసేందుకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానికుల ఆగ్రహాన్ని రుచి చూసిన విషయం విధితమే.

జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్

ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు సిద్ధమవుతున్న ప్రజలకు మద్దతు తెలిపేందుకు పాశిగామ వెళ్లేందుకు సిద్ధపడిన శాసనమండలి సభ్యుడు తాటిపర్తి జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జగిత్యాల లోని జీవన్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

పాశిగామలో పోలీసుల మోహరింపు
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నేపథ్యంలో వెల్గటూరు మండలం పాశిగామలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామస్తులు బయటకు వచ్చి ఆందోళనలు చేపట్టకుండా కట్టడి చేస్తున్నారు.

ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారు: జీవన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ , నియంతృత్వ పాలన కొనసాగుతుందని విమర్శించారు.
ప్రజాభిప్రాయాన్ని పక్కనపెట్టి ఇథనాల్ ఫ్యాక్టరీకి దొంగతనంగా భూమి పూజ చేయడానికి ఆయన తప్పు పట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పరిసరాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.