Karimnagar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పిడుగుపాటుకు ఒకరి మృతి

Karimnagar భారీ గాలులతో కూడిన వర్షం విధాత బ్యూరో, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం సాయంత్రం భారీ గాలులతో కూడిన అకాల వర్షం వ్యవసాయ రంగంపై ప్రభావం చూపింది. కొండగట్టులో పిడుగు పడి ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాళ్లోకి వెళితే.. కరీంనగర్(Karimnagar) జగిత్యాల ప్రధాన రహదారిపై కొండగట్టు వద్ద పిడుగుపాటుకు గురై ముత్యం మల్లేశం(65) అక్కడికక్కడే మృతి చెందాడు. తాటి చెట్టు కింద ముంజలు కోస్తూ విక్రయించే పనిలో […]

  • Publish Date - April 22, 2023 / 02:06 AM IST

Karimnagar

భారీ గాలులతో కూడిన వర్షం

విధాత బ్యూరో, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం సాయంత్రం భారీ గాలులతో కూడిన అకాల వర్షం వ్యవసాయ రంగంపై ప్రభావం చూపింది. కొండగట్టులో పిడుగు పడి ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

వివరాళ్లోకి వెళితే.. కరీంనగర్(Karimnagar) జగిత్యాల ప్రధాన రహదారిపై కొండగట్టు వద్ద పిడుగుపాటుకు గురై ముత్యం మల్లేశం(65) అక్కడికక్కడే మృతి చెందాడు.

తాటి చెట్టు కింద ముంజలు కోస్తూ విక్రయించే పనిలో మల్లేశం ఉండగా అదే చెట్టుపై పిడుగు పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడ్డాడు. వెంటనే ఆయనను జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Karimnagar: CLPనేత పాద‌యాత్ర‌లో అకాల వ‌ర్షం.. కూలిన టెంట్లు.. త‌డిసిన భ‌ట్టి

Padi Kaushik Reddy: ఈటల, రేవంత్ ఇద్దరు తోడు దొంగలే.. IT కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తా: ప్రభుత్వ విప్‌ కౌశిక్ రెడ్డి

Sirisilla | రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు.. NMC గ్రీన్ సిగ్నల్