Karl Svanberg | ఇప్పుడు ఇదే ట్రెండ్.. తెలుగు సినిమా డైలాగ్స్‌తో విదేశీయుల అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్! వైరల్
Karl Svanberg ఇటీవల సోషల్ మీడియా పాపులారిటీ విపరీతంగా పెరిగింది. డబ్‌స్మాష్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.సెలబ్రెటీలు చేసినట్లుగానే డైలాగ్ చెప్పడం, వాళ్లు ఇచ్చినట్లుగానే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి ఫేమస్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. సినిమాల్లోని డైలాగ్స్, పాటలు, డ్యాన్స్‌లో అందులో హీరోలు చేసినట్లుగా చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) ఇలా సోషల్ మీడియాలో […]

ఇటీవల సోషల్ మీడియా పాపులారిటీ విపరీతంగా పెరిగింది. డబ్‌స్మాష్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.సెలబ్రెటీలు చేసినట్లుగానే డైలాగ్ చెప్పడం, వాళ్లు ఇచ్చినట్లుగానే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి ఫేమస్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. సినిమాల్లోని డైలాగ్స్, పాటలు, డ్యాన్స్‌లో అందులో హీరోలు చేసినట్లుగా చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
View this post on Instagram
ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు సెలబ్రిటీ స్టేటస్ కూడా అందుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు విదేశీ వ్యక్తులు కూడా మన తెలుగు సినిమా డైలాగ్స్, డ్యాన్స్‌లని అనుకరి స్తుండడం అందరని ఆశ్చర్య పరుస్తుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలకి సంబంధించి పలు డబ్ స్మాష్ వీడియోలు చేయడం మనం చూశాం.
View this post on Instagram
పుష్ప సినిమాకి వార్నర్ వలనే చాలా ప్రమోషన్ వచ్చిందనే చెప్పాలి. అయితే స్వీడన్ కపుల్ కొన్నాళ్లుగా తెలుగు హీరోలు, వారి సినిమాలకి సంబంధించి డబ్ స్మాష్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. కార్ల్ ఎకటెరినా, స్వాన్‌బర్గ్ టాలీవుడ్‌కి సంబంధించి ఎన్నో రీల్స్ చేశారు.
View this post on Instagram
ఇందులో వారు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌ల సినిమాలలోకి డైలాగ్ లని అనుకురిస్తూ నెటిజన్స్ ప్రశంసలు అందుకున్నారు. తాజాగా స్వాన్ బర్గ్ డీజే టిల్లులోని ఫేమస్ డైలాగ్‌కి రీల్ చేయగా, ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, స్వాన్ బర్గ్ టాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
టాలీవుడ్‌లో చిన్న సినిమాలుగా వచ్చి సంచలన విజయాలు అందుకున్న వాటిలో ‘డీజే టిల్లు’ చిత్రం ఒకటి. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో డైలాగులు, క్యాచీ పంచ్‌లను చాలా మంది ప్రతిరోజూ వారి మాటలతో కలిపి వాడేయడం చూశాం. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు చిత్రంలోని పంచ్ డైలాగులతో రీల్ చేశారు.
View this post on Instagram
ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాకు సీక్వెల్ ఉందని ఇప్పటికే ప్రకటించగా, ఈ చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉండగా, మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
View this post on Instagram