Congress Party | కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగ భృతి అమ‌లు..!

Congress Party | క‌ర్ణాట‌క‌( Karnataka )లో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌ధానంగా యువ‌త‌( Youth )ను, మ‌హిళ‌ల‌( Womens )ను ఆక‌ర్షించే విధంగా హామీల వ‌ర్షం కురిపిస్తోంది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగ యువ‌కుల‌కు( Unemployed ) నిరుద్యోగ భృతి అమలు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. యువ నిధి( Yuva Nidhi ) అనే ప‌థ‌కం కింద గ్రాడ్యుయేట్ల‌కు నెల‌కు రూ. 3 వేలు, డిప్లొమా […]

Congress Party | కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగ భృతి అమ‌లు..!

Congress Party | క‌ర్ణాట‌క‌( Karnataka )లో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌ధానంగా యువ‌త‌( Youth )ను, మ‌హిళ‌ల‌( Womens )ను ఆక‌ర్షించే విధంగా హామీల వ‌ర్షం కురిపిస్తోంది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగ యువ‌కుల‌కు( Unemployed ) నిరుద్యోగ భృతి అమలు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. యువ నిధి( Yuva Nidhi ) అనే ప‌థ‌కం కింద గ్రాడ్యుయేట్ల‌కు నెల‌కు రూ. 3 వేలు, డిప్లొమా స‌ర్టిఫికెట్ క‌లిగి ఉన్న యువ‌కుల‌కు రూ. 1500 నిరుద్యోగ భృతి అమ‌లు చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది.

కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే( Mallikarjun Kharge ), మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ( Rahul Gandhi ), క‌ర్ణాట‌క పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివ‌కుమార్, సీఎల్పీ నాయ‌కుడు సిద్ధ‌రామ‌య్య‌, క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌క‌త్వం స‌మావేశ‌మై చ‌ర్చించిన అనంత‌రం ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఈ యువ నిధి ప‌థ‌కాన్ని కేవ‌లం 2 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే అమ‌లు చేస్తామ‌ని తెలిపారు.

క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఇప్ప‌టికే మూడు హామీల‌ను ప్ర‌క‌టించింది. దాంట్లో తొలి హామీ.. గృహ జ్యోతి( Gruha Jyoti ) ప‌థ‌కం కింద ప్ర‌తి ఇంటికి నెల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు క‌రెంట్ ఉచితం. రెండో హామీ.. గృహ ల‌క్ష్మి( Gruha Laxmi ) ప‌థ‌కం కింద ఇంట్లోని ఒక కుటుంబ స‌భ్యురాలికి నెల‌కు రూ. 2 వేలు, మూడో హామీ.. అన్న భాగ్య( Anna Bhagya ) ప‌థ‌కం కింద కుటుంబంలోని ప్ర‌తి ఒక్క‌రికి నెల‌కు 10 కిలోల బియ్యం పంపిణీ చేయ‌డం. తాజాగా ప్ర‌క‌టించిన నాలుగో హామీ.. యువ నిధి( Yuva Nidhi ) కింద నిరుద్యోగ భృతి ఇవ్వ‌డం.