Karnataka Elections: డీకే శివకుమార్, కుమారస్వామి, గాలి ఆస్తులివే

Karnataka Elections: విధాత, బెంగుళూరు: కర్ణాటకలో ఎన్నికల (Karnataka Elections) ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి పొటీ చేస్తున్న పలువురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్​లో వారి ఆస్తులను ప్రకటించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నామినేషన్​ దాఖలుకు కూడా తుది గడుపు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా […]

  • Publish Date - April 19, 2023 / 07:20 AM IST

Karnataka Elections:

విధాత, బెంగుళూరు: కర్ణాటకలో ఎన్నికల (Karnataka Elections) ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి పొటీ చేస్తున్న పలువురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్​లో వారి ఆస్తులను ప్రకటించారు.

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నామినేషన్​ దాఖలుకు కూడా తుది గడుపు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా అభ్యర్థులు వారి ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ జాబితాలో రూ.1,414 కోట్ల ఆస్తులతో కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షుడు ​డీకే శివకుమార్​ మొదటి స్థానంలో ఉన్నారు. చివరి స్థానంలో ఎవరున్నారంటే..

డీకే శివకుమార్​ ఆస్తులు

కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షుడు డీకే శివకుమార్​ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.1,414 కోట్లని నామినేషన్​ పత్రాల్లో తెలిపారు. ఆయన భార్య పేరిట రూ.133 కోట్లు, కుమారుడు ఆకాశ్​ పేరిట రూ.66 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. వీటిల్లో రూ.970 కోట్ల స్థిరాస్తులు కాగా రూ.244 కోట్ల చరాస్తులు. తనకు రూ.226 కోట్ల అప్పులు ఉన్నాయని శివకుమార్​ అఫిడవిట్​లో పేర్కొన్నారు. రూ.23 లక్షల విలువైన వాచ్​, 4 కిలోల బంగారం కూడా ఉన్నట్లు తెలిపారు. 2013లో డీకే శివకుమార్ కుటుంబ ఆదాయం రూ.252 కోట్లు కాగా.. అది 2018 నాటికి రూ.840 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం శివకుమార్​పై 19 కేసులు ఉన్నాయి.

కుమారస్వామి ఆస్తులు

చెన్నపట్టణ నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి ఆస్తుల విలువ మొత్తం రూ.189.27 కోట్లని ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొన్నారు. ఇందులో కుమారస్వామి దంపతులిద్దరికీ కలిపి రూ.92.84 కోట్ల స్థిరాస్తులు. రూ. 96.43 కోట్ల చరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. 4.130 కిలోల బంగారం, 29 కిలోల వెండి, 54 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కుమారస్వామి పేరు మీద ఒక ట్రాక్టర్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై 5 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్​లో కుమారస్వామి పేర్కొన్నారు.

భాస్కర్‌రావు ఆస్తులు

బీజేపీ అభ్యర్థిగా చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న భాస్కర్‌రావు ఆస్తుల విలువ రూ.7.56 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.2.81 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.4.75 కోట్లు. ఆయన వద్ద 5 లక్షల విలువైన బంగారం ఉంది. భాస్కర్‌రావు భార్య పేరిట మొత్తం రూ.16.35 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

సతీష్ రెడ్డి ఆస్తులు

బొమ్మనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సతీష్ రెడ్డి ఆస్తుల విలువ రూ.151.25 కోట్లు. ఆయన భార్య ఆశా సతీష్ పేరుపై వివిధ బ్యాంకుల్లో రూ.78.66 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. ఆమెకు రూ.5.84 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.

నిఖిల్ కుమారస్వామి ఆస్తులు

హెచ్​డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి రామనగర నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు రూ.46.51 కోట్ల చరాస్తులు, రూ.28 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రూ.38.94 కోట్ల అప్పు ఉంది. 5.67 కోట్ల విలువైన లాంబోర్గినీ వాహనం సహా మొత్తం 5 కార్లను కలిగి నిఖిల్ కలిగి ఉన్నారు.

న్​ఏ హారిస్​ ఆస్తులు

శాంతినగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్​ఏ హారిస్​ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. హారిస్​ కుటుంబానికి మొత్తం రూ.438.22 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

బీవై విజయేంద్ర ఆస్తులు:

షికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుఫున అభ్యర్థిగా ఉన్న బీవై విజయేంద్ర దగ్గర మొత్తం రూ.103.40 కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల సంఘానికి సమర్పించిన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. అందులో స్థిరాస్తులు రూ.56.58 కోట్లు కాగా.. చరాస్తులు రూ.46.82 కోట్లుగా ఉంది.

గాలి లక్ష్మి అరుణ ఆస్తుల వివరాలు:

బళ్లారి నుంచి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ(కేఆర్​పీపీ)తరఫున పోటీకి దిగుతున్న గాలి జనార్ధన్​ రెడ్డి భార్య అరుణ లక్ష్మి ఎన్నికల అఫిడవిట్​లో తన చరాస్తుల విలువ రూ.96.23 కోట్లని తెలిపారు. ఆమె భర్త జనార్ధన్​ రెడ్డికి రూ.29.20 కోట్ల చరాస్తులు.. రూ.8 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

అరుణ లక్ష్మి వద్ద రూ.77.20 లక్షల విలువైన వెండి, రూ.16.44 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయని అఫిడవిట్​లో పేర్కొన్నారు. అలాగే జనార్ధన్​ రెడ్డి వద్ద రూ.32.18 లక్షల విలువైన వెండి, రూ.7.93 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఉన్నట్లు తెలిపారు.