Karnataka Exit Polls | కొట్టుకుపోయిన ఎగ్జిట్ పోల్స్

వాటి విశ్వ‌స‌నీయ‌త ఎంత‌? క‌ర్ణాట‌క ఫ‌లితాలపై ఏం చెప్పాయి? బాక్సులు తెరిచాక జరిగిందేమిటి? విధాత : క‌ర్ణాట‌క‌ (Karnataka Exit Polls)లో జేడీఎస్ కింగ‌మేక‌ర్‌గా ఆవిర్భ‌విస్తుంద‌ని, కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా నిలిచినా.. అధికారాన్ని స్వ‌యంగా చేప‌ట్ట‌లేద‌ని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. అయితే ఫ‌లితాలు మాత్రం మరో విధంగా వచ్చాయి. ప్రజల నాడిని ఎగ్జిట్‌ పోల్స్‌ పట్టలేవని మరో మారు రుజువైంది. ఏబీపీ న్యూస్‌- సీ వోటర్‌ ఎగ్జిట్ పోల్స్‌ మాత్రం  దగ్గరగా ఉన్నాయి. […]

  • Publish Date - May 13, 2023 / 10:01 AM IST

  • వాటి విశ్వ‌స‌నీయ‌త ఎంత‌?
  • క‌ర్ణాట‌క ఫ‌లితాలపై ఏం చెప్పాయి?
  • బాక్సులు తెరిచాక జరిగిందేమిటి?

విధాత : క‌ర్ణాట‌క‌ (Karnataka Exit Polls)లో జేడీఎస్ కింగ‌మేక‌ర్‌గా ఆవిర్భ‌విస్తుంద‌ని, కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా నిలిచినా.. అధికారాన్ని స్వ‌యంగా చేప‌ట్ట‌లేద‌ని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. అయితే ఫ‌లితాలు మాత్రం మరో విధంగా వచ్చాయి. ప్రజల నాడిని ఎగ్జిట్‌ పోల్స్‌ పట్టలేవని మరో మారు రుజువైంది. ఏబీపీ న్యూస్‌- సీ వోటర్‌ ఎగ్జిట్ పోల్స్‌ మాత్రం దగ్గరగా ఉన్నాయి.

తాజా లెక్కల ప్రకారం ఎవరి సహకారం లేకుండా.. ఎవరూ రాజకీయ బేరసారాలకు పాల్పలేకుండా కాంగ్రెస్‌ తనంతట తానుగా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. మ‌రి ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు ఎలా త‌ప్పినట్లు? ఘనత వహించిన సంస్థలు ఎక్కడ తప్పులో కాలేసినట్టు?

మే 11న వెలువ‌డిన కొన్ని సంస్థ‌ల ఎగ్జిట్ పోల్స్‌

కాంగ్రెస్

బీజేపీ

జేడీఎస్‌

ఏబీపీ న్యూస్ సీ ఓట‌ర్ 122 – 140 62 – 80 20 – 25
‘న్యూస్24’ టుడేస్ న్యూస్‌ 120 92 12
రిప‌బ్లిక్ టీవీ పీ మార్క్ 94- 108 85 -100 24 – 32
టీవీ 9 భార‌తవ‌ర్ష్‌ పోల్ స్ట్రాట్ 99- 109 88 -98 21-26


అస‌లు ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా ఎలా?

ఎగ్జిట్ పోల్స్ విజ‌య‌మంతా ఆ సంస్థ తీసుకున్న శాంపిల్స్‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. శాంపిల్‌గా ప‌లానా పార్టీ బల‌హీనంగా ఉన్న స్థానాలు, బ‌లంగా ఉన్న స్థానాలు, గ‌ట్టిపోటే ఎదురయ్యే స్థానాల‌ను ఎంచుకుంటారు. బూత్ స్థాయికి వెళ్లి స‌ర్వే చేస్తే అంచ‌నాలు స్ప‌ష్టంగా వెలువ‌డే అవ‌కాశ‌ముంటుంది. ఓట‌రు కులం, మ‌తం, భాష‌, ప్రాంతం, ఉద్యోగం ఆధారంగా కొన్ని ప్ర‌శ్న‌లను రూపొందించి ఈ సంస్థ‌లు స‌మాచార సేక‌ర‌ణ చేప‌డ‌తాయి. ప్ర‌స్తుతం చిన్నా పెద్దా క‌లిపి ప్ర‌తి ఎన్నిక‌కు ఏకంగా 15 ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతున్నాయి.

ఎందుకు త‌ప్ప‌వ‌చ్చంటే..

ప్ర‌ధాన స‌మ‌స్య స‌ర్వేలో పాల్గొన్న ఓట‌రు నిజం చెప్ప‌క‌పోవ‌డం. అధికార పార్టీకి వ్య‌తిరేకంగా చెబితే త‌మ‌కు ప‌థ‌కాలు ఆగిపోతాయేమోన‌న్న అభిప్రాయం గ్రామీణ ఓట‌ర్ల‌కు అధికంగా ఉంటుంది. అందుకే వారు చెప్పేవ‌న్నీ నిజాలు కాక‌పోవ‌చ్చు.

ఎగ్జిట్ పోల్ ను విడుద‌ల చేసేట‌ప్పుడు ఆ సంస్థ.. ‘గమనిక’ అని ఒక పాయింట్‌ పెట్టి.. ఇందులో 2 నుంచి 3 శాతం పొర‌పాట్ల‌కు తావుంటుంద‌ని చెబుతుంది. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో ఈ ఎగ్జిట్ పోల్స్ త‌ప్ప‌డానికి కార‌ణం ఇదే. ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సంప్ర‌దాయ ఓటింగ్ షేర్ 3 శాతం వ్య‌త్యాస‌మే.

ఇప్పుడు వార్తా సంస్థ‌లే ఎగ్జిట్ పోల్స్‌ను అంచ‌నా వేస్తున్నాయి. విదేశాల త‌ర‌హాలో ప్ర‌త్యేక సంస్థ‌లంటూ లేవు. మీడియా సంస్థ‌ల‌కున్న బ‌డ్జెట్ ఇబ్బందుల‌తో శాస్త్రీయ ప‌ద్ధ‌తుల్లో స‌ర్వే చేయకుండా పైపైన తేల్చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లున్నాయి.

నమూనాల్లో మ‌హిళా ఓట‌ర్ల అభిప్రాయాల‌కు త‌క్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డం వీటి అంచ‌నాలు త‌ప్ప‌వ‌డానికి మ‌రో కార‌ణం. ఓట‌ర్ల‌లో 50 శాతం మ‌హిళ‌లే ఉండ‌గా.. ఈ స‌ర్వే సంస్థ‌లు త‌మ శాంపిళ్ల‌ల్లో కేవ‌లం 20 శాతం అభిప్రాయాల‌నే మ‌హిళ‌ల ద‌గ్గ‌ర తీసుకుంటాయి. పై నాలుగు ప్ర‌ధాన కార‌ణాలు కాగా.. స‌ర్వే గ‌ణ‌న‌లో నిపుణులు లేక‌పోవ‌డం, మాన‌వ త‌ప్పిదాలు, ప‌ని ఒత్తిడి మొద‌లైనవీ ఎగ్జిట్ పోల్స్ విశ్వ‌స‌నీయ‌త‌పై ప్ర‌భావం చూపిస్తాయి.

Latest News