మనుషుల‌కేమో ఫ్రీ.. చిల‌క‌ల‌కు మాత్రం రూ. 444 బస్ చార్జీ

బస్సు ప్రయాణం ఓ మహిళకు వింత అనుభవాన్ని మిగిల్చింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మాదిరిగానే మహిళలు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అక్కడ శక్తి పేరుతో అమలు చేస్తుంది

  • Publish Date - March 28, 2024 / 02:29 PM IST

విధాత : బస్సు ప్రయాణం ఓ మహిళకు వింత అనుభవాన్ని మిగిల్చింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మాదిరిగానే మహిళలు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అక్కడ శక్తి పేరుతో అమలు చేస్తుంది. ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. నాలుగు రామ చిలుకలను వెంట తీసుకెలుతుంది. శక్తి పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు. కాని చిలుకలను బాలలుగా పరిగణిస్తూ సగం చార్జీ కింద రూ.444 ఛార్జీ టికెట్ వసూలు చేశారు. నిబంధనల మేరకు జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. మనుషులకు ఫ్రీ టికెట్ ఇచ్చి నాలుగు రామచిలుకలకు అది కూడా సగం చార్జీ రూ.444టికెట్ కొట్టిన వైనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.