మల్లన్న సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు

విధాత: శ్రీశైలం: శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 23 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. ప్రధాన ఆలయ ద్వారాలు ఉదయం 3.30 గంటలకు తెరువనున్నారు. తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల […]

  • By: krs    latest    Oct 26, 2022 4:03 AM IST
మల్లన్న సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు

విధాత: శ్రీశైలం: శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 23 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. ప్రధాన ఆలయ ద్వారాలు ఉదయం 3.30 గంటలకు తెరువనున్నారు. తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చని తెలిపారు.

శని, ఆది, సోమవారాలు, పర్వదినాల్లో స్వామివారి అలంకార దర్శన భాగ్యం కల్పిస్తామని, బుధవారం నుంచి శుక్రవారం వరకు స్పర్శ దర్శనం ఉంటుందని వెల్లడించారు. ఇక స్వామి వారి సన్నిధిలోని నాగులకట్ట ప్రాంగణం వద్ద ఈ ఏడాది భక్తులు దీపారాధనలు చేయడాన్ని అధికారులు రద్దుచేశారు. ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపారాధన చేసుకోవాలని సూచించారు.