విధాత: అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ ను ప్రభుత్వం మార్చింది. మొదటి సమావేశంలో ఇన్నర్ లాబీలో కేటాయించిన ప్రభుత్వం ఈ సమావేశాలకు వరకు దానిని మార్చి ఔటర్ లాబీకి మార్చింది. కేసీఆర్ చాంబర్‌ను ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడంపై అసెంబ్లీ లాబీలో చర్చ జరుగుతోంది. దీనిపై బీఆరెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వాలు ప్రతిపక్ష నేత కు యేళ్ళ తరబడి ఇన్నర్ లాబీలో కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా ఔటర్ లాబీలో చిన్న రూమ్ ను కేటాయించడంపై చర్చ జరుగుతోంది. మొదటి ఆసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని కేటాయించి రెండో సమావేశాల్లోపే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని అంటున్నారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీ కి మార్చడం పై బీఆరెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీఆరెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు తగిన గౌరవం ఇవ్వాలని బీఆరెఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు.