KCR| ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన కేసీఆర్

KCR| ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన కేసీఆర్

విధాత, హైదరాబాద్: మాజీ సీఎ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు. బ్లడ్‌ షుగర్, సోడియం స్థాయిల పర్యవేక్షణకు ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించడంతో ఆయన రెండు రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో శనివారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కేసీఆర్ వెంట హరీష్‌రావు, సంతోష్‌రావు లు ఉన్నారు.

అనంతరం కేసీఆర్ నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు. ఆయన రెండు మూడు రోజులు అక్కడే ఉండే అవకాశముందని..రెండు రోజుల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించవచ్చని బీఆర్ఎస్ వర్గాల సమాచారం.