KCR
విధాత: సీఎం కేసీఆర్ పాలన ఊపర్ షేర్వాణీ..అందర్ పరేషానీ మాదిరిగా ఉందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు పోచంపల్లి మండలంలో పర్యటించారు.
మూసీ వరదలతో కాలువలు, చెరువులు పొంగిపొర్లడంతో పోచంపల్లి చెరువు కింద 300ఎకరాల్లో గుర్రపుడెక్క కమ్మేసి పంట పొలాలు దెబ్బతిన్నాయని అన్నారు. తెలంగాణ మోడల్, కేసీఆర్ మోడల్ అంటు కబ్జాలు, అక్రమ వ్యాపారాలు తప్ప కేసీఆర్ పాలనలో ప్రత్యేకత ఏమి లేదన్నారు.
వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30వేల సహాయం చేయాలని డిమాండ్ చేశారు. లక్ష 20వేల కోట్లతో ఎవరికి ఉపయోగం లేని కాళేశ్వరం కట్టి 30టీఎంసీలు కూడ ఎత్తిపోయలేక తిప్పిపోతలగా మారిందన్నారు. కడెం వంటి పాత ప్రాజెక్టుల, చిన్న నీటి వనరుల మరమ్మతుతులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ చాల బీజీగా ఉన్నారని, ఆయన తెలంగాణ సీఎం అన్న సోయి కూడా మరిచిపోయారని, ఇప్పటికైన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, చింత సాంబమూర్తి తదితరులున్నారు.
భూదాన్ పోచంపల్లి …. inspected damaged farm due to heavy rains at Pochampally pc Bhongir
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదన్ పోచంపల్లి లో బి.జె.పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలన కార్యక్రమాన్ని హాజరు కావడం జరిగింది.… pic.twitter.com/TiAC0s1oEG— boora narsaiah goud (@NarsaiahBoora) July 30, 2023