కేతికా శర్మ.. అంత ఉన్నా ఏం లాభం?

Ketika Sharma కేతికా శర్మ.. ఈమె పూరి జగన్నాథ్ డిస్కవరీ హీరోయిన్. కేతికాకు గొప్ప యాక్టింగ్ టాలెంట్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆమెను దురదృష్టం వెంటాడుతోంది. పూరి జగన్నాథ్ కేతిక శర్మను టాలీవుడ్‌కు తీసుకొని వచ్చాడు. తన కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ మూవీలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. దర్శకుడు అనిల్ తెరకెక్కించిన ఈ మూవీ యూత్‌ను ఊపేస్తుందని అందరూ భావించారు. ఆకాష్, కేతిక కూడా మొహమాటం లేకుండా బోల్డ్‌గా […]

  • Publish Date - January 22, 2023 / 03:13 PM IST

Ketika Sharma

కేతికా శర్మ.. ఈమె పూరి జగన్నాథ్ డిస్కవరీ హీరోయిన్. కేతికాకు గొప్ప యాక్టింగ్ టాలెంట్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆమెను దురదృష్టం వెంటాడుతోంది. పూరి జగన్నాథ్ కేతిక శర్మను టాలీవుడ్‌కు తీసుకొని వచ్చాడు. తన కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ మూవీలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. దర్శకుడు అనిల్ తెరకెక్కించిన ఈ మూవీ యూత్‌ను ఊపేస్తుందని అందరూ భావించారు. ఆకాష్, కేతిక కూడా మొహమాటం లేకుండా బోల్డ్‌గా న‌టించినా ఈ చిత్రం కమర్షియల్‌గా ఆడలేదు.

ఆ తర్వాత ఆమె నాగశౌర్య హీరోగా వచ్చిన ‘లక్ష్య’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కోసం నాగశౌర్య ఎంతో కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీతో మెప్పించాడు. కానీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇది కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ముచ్చటగా మూడోసారి మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రంగ రంగ వైభవంగా’ మూవీలో నటించిన దానిని కూడా ప్రేక్షకులు తిప్పి కొట్టారు. దీంతో ఆమెకు అవకాశాలు కనుమరుగయ్యాయి.

ప్రస్తుతం ఈ భామ ఆఫర్స్ లేక ఖాళీగా ఉంటుంది. గతంలో నిధి అగర్వాల్ చెప్పినట్టు టాలెంట్ ఉండాలి.. తొక్క తోటకూర అంతా నథింగ్. హీరోయిన్‌గా ఎదగాలంటే అదృష్టం ఉండాలి. పేపర్ మీద అద్భుతం అనిపించిన కథ.. స్క్రీన్ పై తేలిపోవచ్చు. స్క్రిప్ట్ దశలో సాదాసీదాగా అనిపించిన కథ వెండితెరపై మిరాకిల్స్ చేయవచ్చు. కాబట్టి కేవలం ల‌క్ ఫ్యాక్టర్ మాత్రమే పరిశ్రమలో ఎదిగేందుకు కావాల్సిన ఓన్లీ ఫ్యాక్టర్ అని తేల్చి చెప్పింది.

అది కేతిక శర్మ విషయంలో నిజమేనని అర్థమవుతోంది. అందం, అభినయం కూడా ఉండి కనీస గుర్తింపు నోచుకోలేక కేతికాశర్మ తెరమరుగవుతూ ఉండడం బాధాకరమైన విషయమే.

ఇదిలా ఉంటే కొందరు మాత్రం.. మొత్తం ఒక్కసారే పరిచేస్తే.. ఇలానే ఉంటుంది. ఊరిస్తూ ఉంటేనే.. కొన్నాళ్లపాటు ఉంటామని హీరోయిన్లు గుర్తు పెట్టుకోవాలి అంటూ.. కేతికకు సలహాలు ఇచ్చే వారు కూడా లేకపోలేదు.

Latest News