పడిపోతామన్న భయంతోనే మజ్లిస్‌తో ఒప్పందం: కిషన్‌రెడ్డి

- ప్రొటెం స్పీకర్ ముందు ప్రమాణ బహిష్కరణకు నిర్ణయం
విధాత: రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా మజ్లిస్‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్ధిన్ ఒవైసీని ఎంపికి చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా.. దగ్గినా పడిపోతుందన్న భయం ఆ పార్టీకి పట్టుకుందని, అందుకే మజ్లిస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాల రాసిందని, అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. ప్రొటెం స్పీకరణ ఎంపిక అంశంలో నిబంధనల ఉల్లంఘటనపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
ప్రొటెం స్పీకర్ ముందు ప్రమాణం బహిష్కరణకు మా పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారన్నారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించడంతో ఒక్క స్థానం నుంచి 8 సీట్లకు పెరిగామని, మా ఓటు బ్యాంకు శాతం 6.97నుండి 14 శాతానికి పెరిగిందన్నారు. మునుముందు మరింత ప్రజాదరణ దిశగా బీజేపీ ముందుకెలుతుందన్నారు.