కూలగొడితే కాళ్లు, రెక్కలు విరిచేస్తా: CM KCR

నేను మాట్లాడేది తప్పైతే రాజీనామా చేస్తా విధాత: రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ ప్రతిష్ట చిరస్థాయిగా ఉండేలా తెలంగాణ నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టామని, సచివాలయం డోములు కూలగొడితే చూస్తూ ఊరుకుంటామా, అంత ఈజీగా ఉంటదా? వాళ్ల కాళ్లు రెక్కలు విరిచిపడేస్తామని సిఎం కె.చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. వీళ్ల తమాషాలను ప్రజలే చూసుకుంటారన్నారు. కొత్త సచివాలయం, ప్రగతి భవన్ పై విపక్ష పార్టీ అధినేతలు ఏ.రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన‌ విమర్శానాత్మక వ్యాఖలపై సిఎం తీవ్రంగా […]

  • Publish Date - February 12, 2023 / 01:25 PM IST
  • నేను మాట్లాడేది తప్పైతే రాజీనామా చేస్తా

విధాత: రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ ప్రతిష్ట చిరస్థాయిగా ఉండేలా తెలంగాణ నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టామని, సచివాలయం డోములు కూలగొడితే చూస్తూ ఊరుకుంటామా, అంత ఈజీగా ఉంటదా? వాళ్ల కాళ్లు రెక్కలు విరిచిపడేస్తామని సిఎం కె.చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. వీళ్ల తమాషాలను ప్రజలే చూసుకుంటారన్నారు.

కొత్త సచివాలయం, ప్రగతి భవన్ పై విపక్ష పార్టీ అధినేతలు ఏ.రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన‌ విమర్శానాత్మక వ్యాఖలపై సిఎం తీవ్రంగా అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి నాయకులను ప్రజలే చూసుకుంటారని, న్యూఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు.

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. 8 రోజులు, 56 గంటలు, 38 ప్రశ్నలు, 5 బిల్లులు

24 గంటలూ కరెంట్ కావాలని అక్కడ ఎవడో ధర్నా చేశాడు, గ్రిడ్‌లో లోడ్ పెరిగితే సరఫరా కట్ చేశారు. నిమిషం కూడా కరెంట్ కట్ కాదని, ఎంత ఖర్చైనా నిరంతర విద్యుత్ సరఫరా చేసి తీరుతామన్నారు. దేశంలో బిసిల లెక్కలు తేల్చేందుకు జన గణన ఎందుకు చేపట్టలేదని, యుద్ధాలు జరిగిన సమయంలో కూడా గణన చేశారని గుర్తు చేశారు.

మోదీకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, తెలంగాణ పట్ల వివక్ష మానుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. పార్లమెంటులో మోదీ పచ్చి అబద్దాలు చెప్పారని, దేశం కోసం ఒక్క మాట కూడా మాట్లాడ లేదన్నారు. అప్పులు చేయడంలో మోదీని మించిన ఘనుడు లేరని, 2024 తరువాత బిజెపి కుప్ప కూలుతుందన్నారు.

ప్రతిపక్షాలు అదానీ కంపెనీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటేశారన్నారు. ప్రియ మిత్రుడు గౌతమ్ అదానీ విషయంలో మోదీ ఏం చేస్తారో చూడాలని కెసిఆర్ అన్నారు. దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు ఎందుకు దిగుమతి చేసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. దమ్మున్న ప్రధాని ఉంటే కరెంట్ సరిపోను ఎందుకు రావడం లేదని, బిజెపి పాలిత రాష్ట్రాలలో 24 గంటల విద్యుత్ సరఫరా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడ కూడా రైతు వేదికలు లేవన్నారు. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియా గా మారిందన్నారు. ఎన్టీఏ అంటే నో డేటా అవేలేబుల్ అన్నారు. కాంగ్రెస్, బిజెపిలు దేశాన్ని ముంచాయని, కాంగ్రెస్ పార్టీ లైసెన్స్ రాజ్ కాగా బిజెపి సైలెన్స్ రాజ్ గా కేసీఆర్ అభివర్ణించారు. మా నినాదం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని అన్నారు. కేంద్రానికి నీళ్ల లెక్కలు తేల్చడం చేతకావడం లేదని, బ్రిజేష్ ట్రైబ్యునల్ వేసి రెండు దశాబ్ధాలు దాటినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరి ఉందన్నారు.

మా.. ఈటల రాజేందర్: CM KCR! 2 గంటల ప్రసంగంలో 12 సార్లు ప్రస్తావన

ప్రధాని మన్మోహన్ సింగ్ త‌న హయాంలో దేశ అప్పులు 14 శాతం తగ్గించగా, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 54 శాతం అప్పులు పెరిగాయని విమర్శించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు, ఇదేనా ఫెడరల్ వ్యవస్థ అని అడిగారు. నేను చెప్పే ప్రతి మాట నూటికి నూరు శాతం నిజం, ఏ ఒక్కటి తప్పని నిరూపించినా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెసిఆర్ సవాల్ విసిరారు.

తెలంగాణకు రావాల్సిన రూ.470 కోట్లు ఆంధ్రాకు ఇచ్చారని మండిపడ్డారు. విశ్వ విద్యాలయాల్లో విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అడిగారని, ఆయన అడిగిన డిమాండ్ న్యాయ సమ్మతమైందని, డైట్ ఛార్జీలు పెంచేందుకు మంత్రులు హరీశ్, కెటిఆర్, సబిత సమావేశం నిర్ణయిస్తారని, ఆ సమావేశానికి ఈటలను కూడా ఆహ్వానించాలని కెసిఆర్ సూచించారు. రెండు మూడు రోజుల్లో ఛార్జీలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయాలన్నారు.

ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం..

ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ద్రవ్య వినిమయ బిల్లులను ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ శాసన సభ నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగ‌గా, 56 గంటల 25 నిమిషాలు సభ పని చేసింది.

నన్ను డ్యామేజ్ చేసేందుకే KCR అలా మాట్లాడారు: ఈటల కౌంటర్