ఈగో హర్ట్: ద‌ర్శకుడి మొహాన అడ్వాన్స్ విసిరికొట్టిన హాట్ బ్యూటీ

విధాత: సుకుమార్ శిష్యుడు, కొత్త దర్శ‌కుడైన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్‌ హీరోగా విజయసేతుపతి కీలకపాత్రలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఉప్పెన’‌. ఈ మూవీ అంద‌రికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో రాత్రికి రాత్రి కృతి శెట్టి మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్ అయిపోయింది. ఉప్పెన‌, శ్యామ్ సింగ‌రాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో హిట్ ముంద్ర వేయించుకున్న […]

  • By: krs    latest    Dec 27, 2022 6:09 AM IST
ఈగో హర్ట్: ద‌ర్శకుడి మొహాన అడ్వాన్స్ విసిరికొట్టిన హాట్ బ్యూటీ

విధాత: సుకుమార్ శిష్యుడు, కొత్త దర్శ‌కుడైన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్‌ హీరోగా విజయసేతుపతి కీలకపాత్రలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఉప్పెన’‌. ఈ మూవీ అంద‌రికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో రాత్రికి రాత్రి కృతి శెట్టి మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్ అయిపోయింది.

ఉప్పెన‌, శ్యామ్ సింగ‌రాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో హిట్ ముంద్ర వేయించుకున్న ఈ భామకి ఆ తర్వాత మాత్రం కాలం కలిసి రావడం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె న‌టించిన రామ్ ది వారియ‌ర్‌, నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, సుధీర్‌బాబు స‌ర‌స‌న న‌టించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి మూడు చిత్రాలు ఫ్లాప్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఈమె తన మొదటి చిత్రం సూపర్ థర్టీ తర్వాత మరో హిందీ సినిమా ఒప్పుకుంది.

బాలీవుడ్‌లో ఇంతకుముందు అంధాదున్ వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన శ్రీరాం రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించ‌డానికి అడ్వాన్స్ కూడా తీసేసుకుంది. కానీ షూటింగ్లోకి వెళ్లే ముందు కాస్త ఆడిషన్స్‌లో పాల్గొనాల్సిందిగా డైరెక్టర్ ఆమెకు కబురు పంపాడు.

అంతే మన కృతి శెట్టిగారి ఈగో హర్ట్ అయిందట. కొత్త హీరోయిన్ లాగా నాకేంటి ఆడిషన్స్.. నేను రాను.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాను అని డైరెక్టర్ మొహం మీదనే చెప్పేసి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిందట. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయినా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆమెకు ఇంత ఈగో సరికాదని ఒకనాడు సావిత్రి నుంచి శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి వరకు అందరూ ఆడిషన్స్ లో పాల్గొన్నారని.. హిందీలో ఇప్పటికీ ఎందరో టాప్ హీరోయిన్లు కూడా స్క్రీన్ టెస్ట్ చేయించుకుంటార‌న్న విషయం అమ్మడు ఎంత త్వరగా గ్ర‌హిస్తే అంత మంచిది. లేదంటే మున్ముందు ఆమెకు తిప్పలు తప్పవు.. కాబ‌ట్టి కాస్త ఈగోను త‌గ్గించుకుని విన‌యంగా ఉండ‌టం ఈ కొత్త హీరోయిన్‌కు చాలా ముఖ్య‌మ‌నే చెప్పాలి.