KTR | TS ఐ పాస్ విధానం.. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం

KTR 21 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు జహీరాబాద్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ యూనిట్‌కు శంకుస్థపన చేసిన మంత్రి కేటీఆర్ విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: టీఎస్ ఐ పాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే టి రామారావు(KTR) అన్నారు. జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో 2000 కోట్లతో ఏర్పాటు కానున్న విద్యుత్‌ ప్లాంట్ నిర్మాణానికి ఎమ్మెల్యే మాణిక్యరావుతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ […]

KTR | TS  ఐ పాస్ విధానం.. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం

KTR

  • 21 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు
  • జహీరాబాద్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ యూనిట్‌కు శంకుస్థపన చేసిన మంత్రి కేటీఆర్

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: టీఎస్ ఐ పాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే టి రామారావు(KTR) అన్నారు. జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో 2000 కోట్లతో ఏర్పాటు కానున్న విద్యుత్‌ ప్లాంట్ నిర్మాణానికి ఎమ్మెల్యే మాణిక్యరావుతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గా మంత్రి కే టి ఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో 23 వేల పరిశ్రమలు నెలకొల్పాము. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. టి ఎస్ ఐ పాస్ ద్వారా 3 లక్షల 30 వేల పెట్టుబడులు వచ్చాయనీ చెప్పారు.

కొత్తగా వచ్చే కంపెనీలలో స్థానిక యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్స్ పెంచుకోవాలని మంత్రి సూచించారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేన‌న్నారు. తెలంగాణ ఆర్టీసీలో, తెలంగాణ ప్రైవేట్ వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాము. తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళిక బద్దంగా చేస్తున్నామన్నారు.

ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారాలనే లక్ష్యంతో పని చేస్తున్నాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి సంబంధించిన అన్ని రకాల పార్ట్స్‌ తయారీ అయ్యే విధంగా ప్రణాళిక రూపొదించామన్నారు.

హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ఒప్పందాలు చేసుకున్నామనీ ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్(KTR) అన్నారు.