Minister KTR | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్న విషయం విదితమే. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. కేసీఆర్ జాతీయ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు.. ఇంటర్నేషనల్ పార్టీ పెట్టుకోవచ్చు. అంతేకాదు చైనాలో కూడా పోటీ చేయొచ్చు అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అమెరికా, చైనాలోనూ పోటీ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంటర్నేషనల్ లీడర్ రాహుల్ గాంధీ తన సొంత పార్లమెంట్ నియోజకవర్గం అమేథీలో గెలువలేకపోయారని విమర్శించారు. ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్.. తన సొంత నియోజకవర్గంలో ప్రజల్ని ఒప్పించి ఎంపీగా గెలవాలని కేటీఆర్ సెటైర్ వేశారు. జాతీయ పార్టీ ఆశయాలతో ముందుకు వెళ్తున్న కేసీఆర్ ను విమర్శించే హక్కు రాహుల్ కు లేదన్నారు కేటీఆర్. 2019లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాహుల్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
International leader Rahul Gandhi who can’t even win his own parliament seat in Amethi ridicules Telangana CM KCR Ji’s national party ambitions