KTR
విధాత: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఓ మోసాగాడు నేరస్తుడని, సుఖేష్ అనే రోగ్ చేసిన అడ్డమైన ఆరోపణలపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. తీహార్ జైలు నుండి సుఖేష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి
బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపైన గతంలో వరుస లేఖల ద్వారా తీవ్ర ఆరోపణలు చేయగా, ఇటీవల కేటీఆర్‌పైన కూడా అదే రీతిలో ఆరోపణలు చేశారు.
సుఖేష్ ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన కేటీఆర్ అసలు సుఖేష్ ఎవరో నాకు తెలియదని, తాను అతడి గురించి గతంలో ఎప్పుడు వినలేదన్నారు. మీడియా ద్వారానే సుఖేష్ మతిలేని ఆరోపణలు తన దృష్టికి వచ్చాయన్నారు. సుఖేష్ అనే రోగ్ చెప్పే పచ్చి అబద్ధాలను ప్రచురించే ముందు మీడియా ఆలోచించుకోవాలని కోరుతున్నానన్నారు.
సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా తెలంగాణ లెఫ్టినెంట్ గవర్నర్ కు అంటు ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో కవిత, కేటీఆర్ తరుపు సన్నిహితులు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి నా వద్ధ ఉన్న ఆధారాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.
కవితకు వ్యతిరేకంగా ఈడికి తాను ఇచ్చిన స్టెట్‌మెంట్‌లోని ఎవిడెన్స్‌ను ఇవ్వమని అడుగుతున్నారని, ఆధారాలిస్తే 100కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశ పెడుతున్నారని సుఖేష్ తన లేఖలో ఆరోపించారు.