Viral Video | అడవి రారాజు మృగరాజు. అంటే అడవి జంతువులన్నింటికి కూడా సింహామే రాజు. అడవిలో కనిపించే ప్రతి జంతువును సింహాం వేటాడుతోంది. అందుకే మిగతా జంతువులన్నీ సింహం కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి.
కానీ గజరాజులకు మృగరాజులు భయపడి పోయాయి. ఏనుగుల మందను చూసి పిల్ల సింహాలు పారిపోయాయి. ఆ తర్వాత తల్లి సింహాం కూడా పరుగెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గజరాజుల దెబ్బకు తోక ముడిచిన మృగరాజులపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు.
అడవికి నిజమైన రాజు ఏనుగు అని కొందరు కామెంట్ చేయగా, ఏనుగులను చూసి సింహాలు పరుగెత్తడం కొంచెం ఆశ్చర్యంగానే ఉందని మరికొందరు కామెంట్ చేశారు. ఎప్పుడు కూడా తామే బలవంతులం అని ఊహించుకోవడం సరికాదనే దానికి ఈ వీడియో నిదర్శమని మరికొందరు పేర్కొన్నారు.
Viral Video | గజరాజులకు భయపడ్డ మృగరాజులు.. https://t.co/ckG2EUzGRT pic.twitter.com/gpIiNCd3U3
— vidhaathanews (@vidhaathanews) December 28, 2022