YS JAGAN | లండన్ యాత్రకు.. YS జగన్!

YS JAGAN | ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ రెండో తేదీ నుంచి వారం రోజులపాటు తన కుమార్తెను చూసేందుకు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. ఇప్పటికే తాను కోర్టులో పిటిషన్ సైతం వేయగా. కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన ఫారిన్ వెళ్తున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు పది రోజుల లండన్ టూర్ వెళ్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో సీబీఐ విచారణ […]

  • By: krs    latest    Sep 01, 2023 2:12 AM IST
YS JAGAN | లండన్ యాత్రకు.. YS జగన్!

YS JAGAN |

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ రెండో తేదీ నుంచి వారం రోజులపాటు తన కుమార్తెను చూసేందుకు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. ఇప్పటికే తాను కోర్టులో పిటిషన్ సైతం వేయగా. కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన ఫారిన్ వెళ్తున్నారు.
సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు పది రోజుల లండన్ టూర్ వెళ్తున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ కి విదేశీ పర్యటనలు చేసేందుకు కోర్టు అనుమతి కావాలి. దాని మీద కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది.ఇక ఆయన సెప్టెంబర్ 2న తన తండ్రి వైయస్ఆర్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చి ఆయన సమాధి వద్ద నివాళి అర్పిస్తారు.

అక్కడ నుంచే నేరుగా భార్యతో కలిసి లండన్ వెళ్తారు. . త్వరలో ఏపిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జగన్ రానున్న ఆర్నెల్లు చాలా బిజీగా ఉంటారు. ఈ లోపే తన వ్యక్తిగత పర్యటన పూర్తి చేసుకునే పనిలో ఆయన ఉన్నారు.

ఆయన విదేశాలలో ఉన్నా అవసరం అయినపుడు అత్యవసర పనులు పూర్తి చేసేందుకు ఆయన రెడీగా ఉంటారు. ఎవరెవరికి ఏయే బాధ్యతలు ఇవ్వాలన్నది చూసుకుని అంతా తన కనుసన్నల్లో ఉంచుకునే ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.

Vidhatha Publications Pvt. Ltd Vidhaatha ePaper, Fri, 1 Sep 23