మరో 4 బర్రెల కోసం డబ్బులిస్తానన్న మంత్రి జగదీష్ రెడ్డి
విధాత, ప్రభుత్వ పథకాలను అందించడంలో తాను రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తానంటూ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త శ్రీకాంత్ కు ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ క్రింద దళిత కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే సబ్సిడీ డెయిరీ యూనిట్ మంజూరు చేసింది.
యూనిట్ మంజూరు ఇచ్చే క్రమంలో పార్టీలు చూడవద్దని మంత్రి ఆదేశాలను పాటించిన అధికారులు, శ్రీకాంత్ కు డెయిరీ మంజూరు చేశారు. హర్యానా గేదె లను తెచ్చిన శ్రీకాంత్ నిర్వహణ లోపం, అవగాహన రాహిత్యంతో డెయిరీ నా వల్ల కాదని వాటిని అమ్మేశాడు. ఈ క్రమంలో బ్యాంక్ రుణం మిగిలిపోయింది.
డెయిరీ ఫాంలో నష్టం.. దళిత యువకుడికి మంత్రి ఆపన్న హస్తంhttps://t.co/liRyTef1HC pic.twitter.com/rxPbPZqNUl
— vidhaathanews (@vidhaathanews) February 8, 2023
మంగళ వారం రోజున కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించడానికి మాచారం గ్రామానికి వెళ్ళిన మంత్రి జగదీష్ రెడ్డిని కలిసిన శ్రీకాంత్ మీరు లోన్ ఇవ్వడం వల్లే నాకు నష్టం వచ్చిందని చెప్పాడు. డెయిరీ
నిర్వహణలో శ్రీకాంత్ అవగాహన రాహిత్యానికి తోడు అమాయకత్వానికి కోపం వ్యక్తం చేస్తూనే, శ్రీకాంత్ ను దగ్గరకు తీసుకుని డెయిరీ నిర్వహణ లోపంతోనే నష్టం వాటిల్లిందని పలు సూచనలు చేశారు.
నీకు నిజంగా బాగు పడాలనే ఉద్దేశ్యం ఉంటే మరో రెండు లక్షలు నేను ఇస్తాను, మళ్లీ డెయిరీ యూనిట్ స్టార్ట్ చేయమని శ్రీకాంత్ కు మంత్రి సవాల్ విసిరారు. తమ పార్టీ కాదని తెలిసి కూడా, మంత్రి తనకు రెండు లక్షలు ఇస్తాననడంతో షాక్ తిన్న శ్రీకాంత్ చెమ్మగిల్లిన కళ్లతో మంత్రిని హత్తుకుని జై కొట్టాడు..
తన లాంటి యువకుల పట్ల మంత్రి జగదీష్ రెడ్డికి ఉన్న ప్రేమకు సలాం కొట్టాడు శ్రీకాంత్.. పార్టీల పేరు తో యువకులను రెచ్చ గొట్టి రాజకీయాలు చేసే నాయకులను చూశాను కానీ, యువకులు శ్రేయస్సు కోసం తపించే నాయకుడు జగదీష్ రెడ్డి అని శ్రీకాంత్ కొనియాడారు.