పోలీసు పెట్రోలింగ్‌లో భాగ‌మైన చిలుక‌.. వీడియో వైర‌ల్`

కొన్ని ప‌క్షులు కొన్ని సంద‌ర్భాల్లో చాలా విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తాయి. త‌మ కూత‌ల‌తో అంద‌ర్నీ ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. మ‌న‌షుల‌తో మ‌మేక‌మై పోతాయి కూడా.

పోలీసు పెట్రోలింగ్‌లో భాగ‌మైన చిలుక‌.. వీడియో వైర‌ల్`

విధాత‌: కొన్ని ప‌క్షులు కొన్ని సంద‌ర్భాల్లో చాలా విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తాయి. త‌మ కూత‌ల‌తో అంద‌ర్నీ ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. మ‌న‌షుల‌తో మ‌మేక‌మై పోతాయి కూడా. అలానే మ‌క్వా(చిలుక జాతి) అనే ప‌క్షి కూడా పోలీసుల మాదిరిగా మారిపోయింది. పోలీసుల పెట్రోలింగ్‌లో భాగ‌మై నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించింది. పోలీసు బైక్‌ల వేగంతో ఆ ప‌క్షి కూడా దూసుకెళ్లింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.


బ్రెజిల్‌లోని మిరాసిమ డు టోకాన్‌టిన్స్ అనే సిటీలో ఇద్ద‌రు పోలీసులు బైక్‌ల‌పై పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఇక ఆ పెట్రోలింగ్ బైక్‌ల మ‌ధ్య మ‌క్వా వాలిపోయింది. ఆ పోలీసుల పెట్రోలింగ్‌లో ఆ ప‌క్షి భాగ‌మైపోయింది. వారి వేగానికి అనుగుణంగా అది ముందుకు క‌దిలింది. ఈ వీడియోను డిసెంబ‌ర్ 7వ తేదీన పోలిసియా మిలిట‌ర్ డు టోకాన్‌టిన్స్ అనే సోషల్ మీడియా గ్రూపులో షేర్ చేశారు.


మ‌క్వా అనే ప‌క్షి చిలుక కుటుంబానికి చెందిన‌ది. మ‌క్వా నీలం, ప‌సుపు రంగులో ఉండి, ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఈ ర‌కం ప‌క్షులు ఎక్కువ‌గా సౌత్ అమెరికాలోని అమెజాన్ రీజియ‌న్‌లో క‌నిపిస్తాయి. మ‌క్వాలు క‌మ్యూనికేష‌న్‌లో మంచి ప్రావీణ్యాన్ని క‌లిగి ఉంటాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.