ల‌వ‌ర్‌ను తిట్టింద‌ని.. డాక్ట‌ర్‌పై క‌త్తితో దాడి చేసిన వార్డు బాయ్

Maharashtra | ఓ వార్డు బాయ్ దారుణానికి పాల్ప‌డ్డాడు. మ‌హిళా డాక్ట‌ర్‌పై క‌త్తితో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. బాధిత డాక్ట‌ర్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రంలోని నాసిక్‌లో ఆదివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. నాసిక్ గంగాపూర్ రోడ్డు ఏరియాలో నిమ్స్ హాస్పిట‌ల్ ఉంది. ఆ హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్ సోన‌ల్ దార‌డే ప‌ని చేస్తుంది. అయితే అదే ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న వార్డు బాయ్‌ను, అత‌ని ప్రియురాలిని డాక్ట‌ర్ […]

  • Publish Date - December 29, 2022 / 02:10 AM IST

Maharashtra | ఓ వార్డు బాయ్ దారుణానికి పాల్ప‌డ్డాడు. మ‌హిళా డాక్ట‌ర్‌పై క‌త్తితో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. బాధిత డాక్ట‌ర్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రంలోని నాసిక్‌లో ఆదివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నాసిక్ గంగాపూర్ రోడ్డు ఏరియాలో నిమ్స్ హాస్పిట‌ల్ ఉంది. ఆ హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్ సోన‌ల్ దార‌డే ప‌ని చేస్తుంది. అయితే అదే ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న వార్డు బాయ్‌ను, అత‌ని ప్రియురాలిని డాక్ట‌ర్ సోన‌ల్ ఇటీవ‌లే తిట్టింది. త‌నతో పాటు త‌న ల‌వ‌ర్‌ను కూడా తిడుతావా అంటూ ఆమెపై కోపం పెంచుకున్నాడు. స‌మ‌యం కోసం వేచి చూశాడు. డాక్ట‌ర్ త‌న గ‌దిలో ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో క‌త్తితో మెడ‌పై దాడి చేశాడు. అనంత‌రం అక్క‌డ్నుంచి వార్డు బాయ్ పారిపోయాడు.

అప్ర‌మ‌త్త‌మైన ఆస్ప‌త్రి సిబ్బంది బాధితురాలికి చికిత్స అందించారు. డాక్ట‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డాక్ట‌ర్ వాంగ్మూలాన్ని న‌మోదు చేసుకున్నారు. వార్డు బాయ్‌ను మంగ‌ళ‌వారం పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం రిమాండ్‌కు త‌ర‌లించారు.