Maharashtra – Karnataka Border Dispute | మహారాష్ట్ర – కర్నాటక సరిహద్దు వివాదం రోజుకు రోజుకు మరింత ముదురుతున్నది. బెల్గాం – హిరేబాగ్వాడి టోల్‌బూత్ ఓ ట్రక్కుపై కన్నడ రక్షణ వేదిక సంఘటన్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రకు వెళ్తున్న ట్రక్కులను లక్ష్యంగా చేసుకొని దాడి చేయగా.. ఆరు ట్రక్కులు ధ్వంసమైనట్లు సమాచారం. కన్నడ రక్షణ వేదిక ఆధ్వర్యంలో మహారాష్ట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ట్రక్కులపైకి రాళ్ల దాడికి దిగారు. పోలీసులకు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కన్నడ రక్షణ వేదిక, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. కన్నడ రక్షణ వేదికకు చెందిన వందలాది మంది కార్మికులు హిరేబాగ్వాడి వద్ద మహారాష్ట్ర ట్రక్కులను అడ్డుకున్నారు. కార్యకర్తలు కన్నడ రక్షణ వేదిక జెండాలు పట్టుకుని నినదించారు. అయితే, ట్రక్కుల దాడిపై మహారాష్ట్ర నేతలు ఖండించారు.
ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కర్ణాటక హోంమంత్రిని కోరుతామని ఉదయ్ సామంత్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులపై ఎన్‌సీపీ నేత శరద్ పవార్ ఘాటునే స్పందించారు. సరిహద్దుల్లో ఏం జరిగిందనేని ఆమోదయోగ్యం కాదని.. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని, దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసినా ప్రయోజనం లేదని.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై పరిస్థితిని దిగజార్చారంటూ పవార్ మండిపడ్డారు. ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అంబేద్కర్‌ను స్మరించుకోవాల్సిన రోజన్నారు. మహారాష్ట్ర – కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన పరిణామాలు ఖండించదగినవన్నారు. దాడులు ఆకపకోతే పరిస్థితులు మరో మలుపు తిరుగుతుందని, దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. 48 గంటల్లో పరిస్థితి చక్కకబడకపోతే తనతో పాటు అందరూ కర్ణాటకకు వెళ్తామని అల్టిమేటం జారీ చేశారు.