విధాత : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బీఆరెస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లా రెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , కొడుకు భద్ర రెడ్డిలు కలిశారు. బీఆరెస్‌కు చెందిన వారంతా డీకే శివకుమార్‌తో భేటీ కావడంతో వారంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారా అన్న ప్రచారానికి తెరలేసింది. ఇప్పటికే వారు సీఎం సలహాదారు వేంరెడ్డి నరేందర్‌రెడ్డితో భేటీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి, అల్లుడు, కొడుకు సహా కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మల్లారెడ్డి ఆక్రమ కట్టడాలు, భూ ఆక్రమణలపై వరుస చర్యలకు ఉపక్రమించడంతో మల్లారెడ్డి తన ఆస్తులను, వ్యాపారాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ప్రచారం వినిపిస్తున్నది.