CM KCR | పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. సభా వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ.. మంత్రి మల్లారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఆయనను టైగర్ అంటూ సంబోధించారు. గౌరవ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, టైగర్ మల్లారెడ్డి అని సభకు కేసీఆర్ పరిచయం చేశారు.
టైగర్ మల్లారెడ్డి అనగానే సభలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. టీఆర్ఎస్ శ్రేణులు మల్లారెడ్డికి భారీ స్థాయిలో మద్దతు ప్రకటించారు. దీంతో చూడవోతే మల్లన్న గాలే బాగున్నది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోసారి సభలో అపూర్వ స్పందన లభించింది. అంతే కాదు.. సభా వేదిక పైకి మంత్రులను ఆహ్వానించే సమయంలో గాయకుడు సాయిచంద్ మల్లారెడ్డి పేరును వ్యాఖ్యానించగానే.. పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
Tiger mallareddy Garu✊✊@TelanganaCMO @trspartyonline @KTRTRS @chmallareddyMLA pic.twitter.com/xNfxkrYg6h
— CMR SAINYAM MEDCHAL (@CSainyam) December 4, 2022
ఇక సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పనితీరును ప్రశంసించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నాలుగు లేన్ల రోడ్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇరుకైన రోడ్లు ఒకప్పుడు ఉండే. ఇప్పుడు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు.
ఇక నిరంజన్ రెడ్డిని నీళ్ల నిరంజన్ రెడ్డి అని సంబోధించారు. సాగునీటిని పంట పొలాలకు అందిచేందుకు నిరంజన్ రెడ్డి ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. ఇక దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వాగులపై చెక్ డ్యాంలు నిర్మించి రైతులకు మేలు చేస్తున్నాడని కేసీఆర్ ప్రశంసించారు.