Mallikarjun Kharge | మోదీ సర్కారును సాగనంపాలి: ఖర్గే
Mallikarjun Kharge దేశవ్యాప్తంగా ఆకాశాన్ని అంటిన కూరగాయల ధరలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నియంత్రణలో మోదీ విఫలం మోదీ ప్రభుత్వం పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహం విధాత: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని నియంత్రించలేని కేంద్రంలోని మోదీ సర్కారును సాగనంపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విట్టర్‌లో కేంద్రం అసమర్థతపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాటా ప్రకారం.. విశాఖపట్నంలో […]
Mallikarjun Kharge
- దేశవ్యాప్తంగా ఆకాశాన్ని అంటిన కూరగాయల ధరలు
- ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నియంత్రణలో మోదీ విఫలం
- మోదీ ప్రభుత్వం పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహం
విధాత: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని నియంత్రించలేని కేంద్రంలోని మోదీ సర్కారును సాగనంపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విట్టర్‌లో కేంద్రం అసమర్థతపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాటా ప్రకారం.. విశాఖపట్నంలో టమాట ధర కిలో రూ.160కి చేరింది. నిరంతర వర్షాల కారణంగా రవాణా సరఫరాలో అంతరాయం ఏర్పడి దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ టమాట ధరల కిలోకు రూ.155కి చేరుకున్నాయి. మెట్రోలలో, రిటైల్ టమాట ధరలు కిలోకు రూ.58-148 పరిధిలో ఉన్నాయి.
मोदी सरकार की लूट से महँगाई और बेरोज़गारी दोनों लगातार बढ़ रही है। पर भाजपा सत्ता के लालच में लीन है।
▫️सब्ज़ियों के दाम आसमान छू रहे हैं।
▫️देश में बेरोज़गारी दर 8.45% हो गया है।गाँवों में बेरोज़गारी दर 8.73% है।
▫️गाँवों में मनरेगा डिमांड चरम पर, पर काम नहीं। ग्रामीण वेतन… pic.twitter.com/G0qRE0ZRI5
— Mallikarjun Kharge (@kharge) July 5, 2023
కోల్‌కతాలో అత్యధికంగా రూ.148, ముంబైలో అత్యల్పంగా కిలో రూ.58 పలుకున్నది. ఢిల్లీ, చెన్నైలలో కిలో రూ.110, రూ. 117గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటున కిలోకు రూ.83.29, మోడల్ ధర కిలోకు రూ.100 పలుకుతున్నాయి.
నిరుద్యోగిత రేటు 8.45 శాతం “మోదీ ప్రభుత్వ దోపిడీ కారణంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండూ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ, బీజేపీ మాత్రం అధికార దాహంలో మునిగిపోయింది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో నిరుద్యోగిత రేటు 8.45 శాతానికి పెరిగింది. గ్రామాల్లో నిరుద్యోగ రేటు 8.73%గా ఉంది” అని ఖర్గే హిందీలో ట్వీట్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram