Mallu Ravi | పదేళ్లలో కవితకు ఫూలే గుర్తురాలేదా?

కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం కరువైందటూ బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు

  • By: Somu    latest    Feb 03, 2024 12:53 PM IST
Mallu Ravi | పదేళ్లలో కవితకు ఫూలే గుర్తురాలేదా?
  • ఆమె మాయ మాటలు మానుకోవాలి
  • నిర్మాణాత్మక సలహాలిస్తే మంచిది
  • ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి


Mallu Ravi | విధాత : కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం కరువైందటూ బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించడం విడ్డూరంగా ఉందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. ఆమె మాయమాటలు మానుకొని, నిర్మాణాత్మక సలహాలిస్తే మంచిదని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు జ్యోతిబా ఫూలే గుర్తురాలేదా?, ప్రజా భవన్‌కు ఫూలే పేరు పెట్టాకే గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.


ఐదేళ్లు మహిళలకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వనప్పుడు కేసీఆర్‌ను కవిత ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఫూలే ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన చేశారని, మహిళలకు, బీసీలకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. గతంలో ఎప్పుడు లేనంతగా తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని రవి చెప్పారు. ప్రజా ప్రభుత్వం అని రాష్ట్రంలోని ప్రజలు భావిస్తున్నారని, సీఎంవో నుండి కమిషరేట్‌ల వరకు, సింగరేణి నుండి హెల్త్ డైరెక్టర్‌ల వరకు సామాజిక న్యాయం పాటించామని తెలిపారు.