భార్యతో వివాహేతర సంబంధం.. మరో మహిళను హత్య చేసిన భర్త

Love Affair | విధాత: తన భార్యతో ఓ యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. ఇంకేముంది ఆ యువకుడి తల్లిని బాధిత భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో వచ్చే సినిమాలివే వివరాల్లోకి వెళ్తే.. డొంగ్రి గ్రామానికి చెందిన ఓ 34 ఏండ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. తన ఇంటి పక్కనే […]

  • Publish Date - November 3, 2022 / 05:19 AM IST

Love Affair | విధాత: తన భార్యతో ఓ యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. ఇంకేముంది ఆ యువకుడి తల్లిని బాధిత భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో వెలుగు చూసింది.

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో వచ్చే సినిమాలివే

వివరాల్లోకి వెళ్తే.. డొంగ్రి గ్రామానికి చెందిన ఓ 34 ఏండ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. తన ఇంటి పక్కనే ఉండే యువకుడితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే భర్తకు ఈ విషయం తెలియడంతో భార్యను మందలించాడు. యువకుడిని కూడా హెచ్చరించాడు.

అరెస్ట్ చేయిస్తా.. కమ్ టు మై రూమ్.. బ్రహ్మాజీ సీరియస్ కామెడీ

అయినప్పటికీ వారు తమ బంధాన్ని కొనసాగిస్తుండటంతో.. భర్తకు కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహాంతో ఊగిపోయిన అతను.. యువకుడి తల్లిదండ్రులు ఓమేశ్వరి, శ్యాందయాల్(54) దాడి చేశాడు. ఇనుప రాడ్డుతో ఓమేశ్వరిని కొట్టి చంపాడు. ఈ ఘర్షణలో శ్యాందయాల్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఓమేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

అప్సరా రాణి.. ఆ అందానికి ఎవ్వడైనా ఫిదా కావాల్సిందే!

సమాచారం అందుకున్న పోలీసులు ఘటానస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనా స్థలి నుంచి ఇనుపరాడ్డుతో పాటు ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ‘నంది’.. తెలంగాణ ‘సింహ’ అవార్డులేమయ్యాయ్!