RGV Vyuham | YS భారతి రెడ్డి పాత్రలో మానస

RGV Vyuham | వ్యూహం చిత్ర కాస్టింగ్ సెలెక్షన్ లో ఆర్జీవీ విధాత: గతంలో పలు బయోగ్రఫీ చిత్రాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎన్నికల ముందు విడుడల చేసే లక్ష్యంతో ‘వ్యూహం’ అనే రాజకీయ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వ్యూహం అనేది వైయస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం అని గతంలోనే ఆర్జీవీ ప్రకటించారు. ఇందులో జగన్ జీవితంలో తారసపడిన పలు రాజకీయ నాయకుల పాత్రలు […]

  • By: krs    latest    Jun 01, 2023 2:17 PM IST
RGV Vyuham | YS భారతి రెడ్డి పాత్రలో మానస

RGV Vyuham |

వ్యూహం చిత్ర కాస్టింగ్ సెలెక్షన్ లో ఆర్జీవీ

విధాత: గతంలో పలు బయోగ్రఫీ చిత్రాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎన్నికల ముందు విడుడల చేసే లక్ష్యంతో ‘వ్యూహం’ అనే రాజకీయ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వ్యూహం అనేది వైయస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం అని గతంలోనే ఆర్జీవీ ప్రకటించారు.

ఇందులో జగన్ జీవితంలో తారసపడిన పలు రాజకీయ నాయకుల పాత్రలు దర్శనం ఇస్తాయి. చంద్ర బాబు నాయుడు.. సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్.. కిరణ్ కుమార్ రెడ్డి తదితర నాయకుల పాత్రలు ఉంటాయి. ఇందులో జగన్ భార్య పాత్ర అయిన భారతి రెడ్డి పాత్రలో మలయాళ నటి మానస రాధాకృష్ణన్ నటించనుంది. ys జగన్‌ పాత్రలో రంగం ఫేమ్‌ అజ్మల్‌ నటిస్తున్నాడు.

ఈమె గతంలో అనంద్‌ దేవరకొండ హీరోగా వచ్చిన హేవే సినిమాలో నటించింది. అంతకుముందు పవన్‌ కల్యాణ్‌ నెక్స్ట్‌ సినిమా హీరోయిన్‌గా మానస పేరు గతంలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది గానీ ఆమె ఆ వార్తలను కొట్టి పారేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆర్జీవీ వ్యూహంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమేరకు భారతి రెడ్డి పాత్రకు మానస సూట్ అవుతుందని పేర్కొంటూ ఆర్జీవీ ట్వీట్ చేస్తూ ఆమె ఫోటోను జత చేశారు.

కాంగ్రెస్ తో విభేదించిన జగన్ ఎన్ని ఇబ్బందులు పడ్డారు.. రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు అన్నది ఒక ఎత్తు కాగా ఆయన జైలు పాలైన తరుణంలో ఆయన జీవన సహచరి భారతి రెడ్డి ఎంతటి మనోవేదన ఎదుర్కొన్నారు అన్నది కూడా చిత్రంలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చూపిస్తారు.

అంతే కాకుండా జగన్ కు ఎలాంటి నైతిక స్థైర్యాన్ని ఇచ్చారు. ఆయన కష్టాలు ఎదుర్కొని సీఎం అయ్యే విషయంలో భారతి రెడ్డి పాత్ర ఎలా ఉందన్నది ఈ సినిమాలో చూపించనున్నారు. దీంతో ఇప్పటికే మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్ వంటి చిత్రాల్లో నటించిన మనసా రాధాకృష్ణన్ అయితేనే భారతి పాత్రకు సరిపోతారని ఆర్జీవీ భావిస్తున్నారు.

గతంలో నిజమైన సంఘటనలతో తీసిన రక్త చరిత్ర వంటి చిత్రాలు మంచి జనాదరణ పొందాయి. ఇప్పుడు ఆర్జీవీ నేరుగా జగన్ జీవన గమనాన్ని వ్యూహం పేరిట సినిమాగా తీస్తున్నారు. ఎన్నికల ముందు రిలీజ్ అయ్యే ఈ సినిమా జగన్ కు మంచి మైలేజీ తెస్తుందని.. ఎన్నికల్లో ఓట్లు వస్తాయని జగన్ అభిమానులు ఆశిస్తున్నారు.