Marriage | ప్ర‌ధాని పేరు చెప్ప‌లేద‌ని పెళ్లి ర‌ద్దు.. వ‌రుడి త‌మ్ముడితో వివాహం

Marriage | అబ్బాయికి చెడు వ్య‌స‌నాలు ఉన్నాయ‌నో, అందంగా లేడ‌నో అమ్మాయిలు పెళ్లిళ్లు క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ ఇదో వింత ఘ‌ట‌న‌. ప్ర‌ధాని పేరు చెప్ప‌లేద‌ని పెళ్లి ర‌ద్దు చేసింది ఓ యువ‌తి. ఇక వ‌రుడి త‌మ్ముడిని పెళ్లాడింది ఆమె. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘాజిపూర్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఘాజిపూర్‌కు చెందిన శివ‌శంక‌ర్(27), రంజ‌న‌కు ఆరు నెల‌ల క్రితం వివాహం నిశ్చ‌య‌మైంది. ఈ నెల 11న మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో […]

Marriage | ప్ర‌ధాని పేరు చెప్ప‌లేద‌ని పెళ్లి ర‌ద్దు.. వ‌రుడి త‌మ్ముడితో వివాహం

Marriage | అబ్బాయికి చెడు వ్య‌స‌నాలు ఉన్నాయ‌నో, అందంగా లేడ‌నో అమ్మాయిలు పెళ్లిళ్లు క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ ఇదో వింత ఘ‌ట‌న‌. ప్ర‌ధాని పేరు చెప్ప‌లేద‌ని పెళ్లి ర‌ద్దు చేసింది ఓ యువ‌తి. ఇక వ‌రుడి త‌మ్ముడిని పెళ్లాడింది ఆమె. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘాజిపూర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఘాజిపూర్‌కు చెందిన శివ‌శంక‌ర్(27), రంజ‌న‌కు ఆరు నెల‌ల క్రితం వివాహం నిశ్చ‌య‌మైంది. ఈ నెల 11న మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఆ జంట ఒక్క‌టైంది. అయితే పెళ్లి వేడుక‌లో భాగంగా వ‌ధువు నివాసంలో 12వ తేదీన ఓ దావ‌త్ ఏర్పాటు చేశారు.

ఇక కొత్త‌గా ఇంటికొచ్చిన బావ‌ను అత‌ని మ‌ర‌ద‌లు, బామ్మ‌ర్ది ఆట ప‌ట్టించారు. చిలిపి ప్ర‌శ్న‌ల‌తో ఆడుకున్నారు. ఉన్న‌ట్టుండి దేశ ప్ర‌ధాని ఎవ‌ర‌ని మ‌ర‌ద‌లు వేసిన ప్ర‌శ్న‌కు శివ‌శంక‌ర్ స‌మాధానం చెప్ప‌లేక‌పోయాడు. దీంతో అక్క‌డున్న వారంతా శివ‌శంక‌ర్‌ను హేళ‌న చేశారు. వ‌ధువు రంజ‌న‌కు కోపం వ‌చ్చింది. అవ‌మానంగా భావించిన రంజ‌న‌.. శివ‌శంక‌ర్ త‌మ్ముడైన అనంత్‌ను అక్క‌డిక‌క్క‌డే పెళ్లి చేసుకుంది. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. రంజ‌న కంటే అనంత్ వ‌య‌సులో చిన్న‌వాడు.